ఏ యోగ్యత లేని వారు ఎందరో సమాజంలో ఇంకా జీవిస్తూనే ఉన్నారు
శ్రమించుటలో విఫలమవుతూ ఏ ఎదుగుదల లేకుండా జీవిస్తూనే ఉన్నారు
బంధం ఉంటుంది కాని బాధ్యతకు భరోసను ఇచ్చే సంపాదన ఉండదు
కుటుంబ బరువును మోస్తూనే ఎన్నో సమస్యలతో సాగుతూనే ఉంటారు
యోగ్యత ఉండదు భాగ్యం ఉండదు సంతోషం ఉండదు ఆరోగ్యం ఉండదు
సామర్థ్యం ఉండదు సహనం ఉండదు సమయోచితం ఉండదు సందర్భం ఉండదు
అన్నీ అనుకూలించే సమయం అవకాశం అదృష్టం కలిగే విధి విధానం ఉండదు
శ్రమ ఒక్కటే సాధన శ్వాస ఒక్కటే ఆసర ధ్యాస ఒక్కటే వేదన శరీరం ఒక్కటే ప్రయత్నం
ఫలితం ఉందో లేదో తెలియదు ఎప్పుడు కలుగుతుందో తెలియదు అది ఎంతో తెలియదు
-- వివరణ ఇంకా ఉన్నది!