పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, అక్టోబర్ 2016, బుధవారం

నేనెవరినో నాకెవరో నాలో ఎదో తెలియని తపనమే

నేనెవరినో నాకెవరో నాలో ఎదో తెలియని తపనమే
నేనెందుకు నాకేమిటో ఎంతో తెలియని కలవరమే  || నేనెవరినో ||

ఎవరికి ఎవరు ఎంత వరకో ప్రేమే తెలిపేను
ఎవరికి ఎవరు ఎందు కొరకో కాలమే చెప్పేను
ఎవరికి ఎవరు ఎలాంటి వారికో బంధమే చూపేను

ఎవరికి ఎవరని అనుభవమే చూపేను
ఎవరికి ఏదని సమయమే కలిగించేను
ఎవరికి ఏమని గుణత్వమే వివరించేను  || నేనెవరినో ||

మనకు ఎవరున్నా మనకు ఏదున్నా సర్దుకుపోవాలి
మనకు ఏమైనా మనకు ఏదైనా మనమే ఒదిగిపోవాలి
మనకు ఏనాటిదైనా ఎంతటిదైనా మనతో గడిచిపోవాలి
మనలో ఏమున్నా మనతో ఏమున్నా మనతో సాగిపోవాలి

మనలో మనమే కలిసిపోవాలి మనకు మనమే పరిచయం చేసుకోవాలి
మనలో మనమే ఎదిగిపోవాలి మనకు మనమే ప్రేమిస్తూ పంచుకోవాలి
మనలో మనమే ఒదిగిపోవాలి మనకు మనమే బంధమే ఇచ్చుకోవాలి
మనలో మనమే ఉండిపోవాలి మనకు మనమే కాలంతో నడుచుకోవాలి  || నేనెవరినో ||

11, అక్టోబర్ 2016, మంగళవారం

ప్రాణం ఉన్నంతవరకే విజయం

ప్రాణం ఉన్నంతవరకే విజయం
జీవం ఉన్నంతలోనే జీవితం
శ్వాస ఉన్నంతలోనే జీవనం
ఊపిరి ఆగేంతవరకే ప్రయాణం
నీవు నేను ఉన్నంతవరకే పరిచయం  || ప్రాణం ||

పరిచయాలతోనే నేస్తం చేసుకుంటేనే బంధం
బంధాలతోనే జీవితం చూసుకుంటూనే ప్రయాణం
ప్రయాణంతోనే జీవనం చెప్పుకుంటూనే అనుభవం
అనుభవాలతో అనురాగం చూపుకుంటూనే విజయం  || ప్రాణం ||

పరిచయాలే పలుకుల కాల గమనం
బంధాలే జీవితాల కార్యక్రమాల గమకం
ప్రయాణమే జీవన విధానాల తరుణం
అనుభవాలే మన ప్రగతి విజయాల చరణం  || ప్రాణం || 

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

బ్రంహనే తలిచావా మహా ఋషినే వీక్షించావా

బ్రంహనే తలిచావా మహా ఋషినే వీక్షించావా
ఆత్మనే కొలిచావా పరమాత్మనే దర్శించావా
మహర్షినే మెప్పించావా మాహాత్మనే చూశావా  || బ్రంహనే ||

ఎవరితో ఏనాటి అనుబంధం లేదా ఎవరితో జీవించలేదా
ఎవరితో ఏనాటి పరిచయం లేదా ఎవరిని పలికించలేదా
ఏనాటికైనా కలవాలనే ఏనాడు ప్రయాణాన్ని సాగించలేదా  || బ్రంహనే ||

సాధనతో సహనంతో బ్రంహనే మెప్పించవా
యజ్ఞంతో యాగంతో మహర్షినే తపించావా
శ్లోకంతో స్తోత్రంతో మహాత్మనే కొలిచావా
అభ్యాసంతో అధ్యాయంతో పరమాత్మనే దర్శించావా  || బ్రంహనే ||

22, సెప్టెంబర్ 2016, గురువారం

ఊరంతా జరిగేను సంభరమే

ఊరంతా జరిగేను సంభరమే
రోజంతా కలిగేను సంతోషమే
ప్రతి రోజు చేసేను కళ్యాణమే
ప్రతి రాత్రి ఒక మహోత్సవమే  || ఊరంతా ||

ఊరంతా ఊరేగింపుతో సాగేను కళ్యాణోత్సవం
ప్రతి రోజు మన కోసమే జరుపుకునేను ఉత్సవం
ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరంతా ఎంతో సంభరం
బాధను మరచి భారమే తగ్గేందుకు కావాలి ఉత్తేజం  || ఊరంతా ||

మనలో మనమే అందరం కలిసేందుకు ఉత్సవం
మనలో మనకు స్నేహమే కలిగేందుకు పరిచయం
మనలో మనకు ఉండాలి ఏ సమస్యలకైనా పరిష్కారం
మనలో మనమే ఏదైనా చేసుకోవాలి సంభరమైన ఉత్సవం  || ఊరంతా || 

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

పరిచయం చేసుకో స్నేహమే తెలుసుకో

పరిచయం చేసుకో స్నేహమే తెలుసుకో
స్నేహమే బంధాలై సంబంధాలుగా మారిపోవునే
బంధాలతో కొత్త పరిచయాల స్నేహం పెరిగిపోవునే  || పరిచయం ||

కుటుంబాల బంధాలలో స్నేహమే జీవమై జీవించునే
సంబంధాల స్నేహాలతో కొత్త జీవితాలు పరిచయమవునే

స్నేహంలో స్వార్థం లేనట్లు సహాయాన్ని తిరిగి పంచేసుకో
స్నేహమే అనర్థం కానట్లు స్వార్థాన్ని వదిలి అర్థం చేసుకో
అందరితో కలిసిపోయి పరమార్థాన్నే సహాయంతో చాటుకో  || పరిచయం ||

స్నేహంతో జీవితం ఆనందమై సాగిపోతూ మాటలతో కాలం హాయిగా గడిచిపోవునే
కార్యాలెన్నో ఒకరికి ఒకరై సులువుగా చేసుకుంటే సమస్యలే లేనట్లుగా తీరిపోవునే

మనలో మనకు మనస్పర్ధాలు వద్దని హెచ్చు తగ్గులు చూసుకోవద్దు
మనలో మనకు మహా చైతన్యం ఉందని గొప్పలు అతిగా చెప్పుకోవద్దు
మనలో మనకు కష్టాలైనా నష్టాలైనా దుఃఖాలైనా పదే పదే తలుచుకోవద్దు

మనలో మనమే స్నేహమై బంధాలుగా పరిచయాల పలకరింపులతో సాగేదమా || పరిచయం || 

15, ఆగస్టు 2016, సోమవారం

నీలో నేనే వెతికాను నా ప్రేమను

నీలో నేనే వెతికాను నా ప్రేమను
నీతో నేనే జీవించాను పరిచయంతో
నీకు నాకు కలిగే భావమే స్నేహ బంధమైన జీవితం || నీలో నేనే ||

ఒకరికి ఒకరు అర్థమైతే పరమార్థమైనదే ప్రేమ
ఒకరికి ఒకరై కలిసి జీవిస్తే పరిశుద్ధమైనదే జీవితం
ఒకరిలో ఒకరు నిలిచిపోతే నిరంతరం స్నేహ భావమే

కలిసి పోవాలి ఒకరికి ఒకరై తోడు నీడగా జీవించాలని
కలిసే ఉండాలి ఒకరితో ఒకరు పరమార్ధంతో ఎదగాలని
కలిసే నడవాలి జీవితాంతం ప్రయాణంతో సాగిపోవాలని  || నీలో నేనే ||

ఎప్పుడు ఎవరికి ఏమౌతుందో కలవరపడి పోయేను హృదయమే
ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఆలోచించాలి అర్థమైన ప్రేమతో
ఎప్పుడు ఎవరు ఎలా ఉన్నా పలకరించాలి మనమే స్నేహంతో

పరిచయాల భావాలతో సాగాలి ప్రశాంతమైన ప్రేమాంతర జీవితం
పలకరింపుల స్వభావాలతో చిగురించాలి నవోదయమైన జీవనం
పలకరింపులతోనే గుర్తించాలి మన హృదయ బంధాల సంబంధం  || నీలో నేనే ||


12, ఆగస్టు 2016, శుక్రవారం

స్నేహానికి బంధం అవసరం లేదురా

స్నేహానికి బంధం అవసరం లేదురా
బంధానికి మంత్రం పరిచయం సోదరా
కలిసిపోతే స్నేహమే బంధమయ్యేనురా
జీవితంలో సహాయమే స్నేహం సహోదరా
వినిపిస్తున్నా నా భావాన్ని స్వీకరించు సోదరా! 

1, ఆగస్టు 2016, సోమవారం

మాటలో ఏముంది మనస్సులో ఏముంది

మాటలో ఏముంది మనస్సులో ఏముంది
ఆలోచనలో సందేహమై మేధస్సులో సందిగ్ధమైనది  || మాటలో  ||

మాటలకై తడబడిపోయా మనస్సులో తపించిపోయా
ఆలోచనలతో ఏవేవో ఎన్నో ఊహిస్తూ తపనపడిపోయా

విజ్ఞానముతో స్పష్టత లేక మేధస్సులో సందిగ్ధమై పోయేనే
అనుభవంతో పరిచయం లేక మదిలో సందేహమై పోయేనే  || మాటలో  ||

జీవిత కాల ప్రయాణంలో ఏది మహా విజ్ఞానమో తోచటం లేదు
జీవన కాల అభివృద్ధిలో ఏది నిత్య సత్యమో నాలో నిర్ణయం లేదు

తెలుసుకోవాలని ఉన్నా తెలియనిదే ఎంతో ఉందని మనస్సులో అనిత్యం
తెలుసుకున్నది ఏదైనా ఎక్కడ ఉపయోగమవుతుందో మేధస్సుకే సందిగ్ధం || మాటలో  ||