29, జులై 2026, బుధవారం

పంచభూతాలు మనకు సర్వస్వమైనా ఎన్నో విధాలుగా ప్రతి క్షణం ఉపయోగపడుతూనే ఉంటాయి

పంచభూతాలు మనకు సర్వస్వమైనా ఎన్నో విధాలుగా ప్రతి క్షణం ఉపయోగపడుతూనే ఉంటాయి  

గాలి మనకు ప్రాణవాయువుగా ఉన్నా దుర్వాసనను ఎక్కడికో వెళ్ళేలా పారద్రోలుతూనే ఉంటుంది 
నీరు మనకు పరిశుభ్రతగా ఆహారానికి ఉపయోగపతున్నా మలినాన్ని ఎక్కడికో ప్రవహింపజేస్తుంది 
భూమి మనకు నివాసం ప్రకృతి ఇస్తున్నా ఇంటి నుండి సమాజం నుండి వచ్చే చెత్తను ఎక్కడికో దూరంగా వేసుకునేలా విశాలంగా ఉంది 

ఆకాశం మనకు ఎంతో ఎత్తులో ఉన్నందువలన మన అంతస్తులు విమాన ప్రయాణాలు ఎన్నో విధంగా సాగిస్తూ పరిశ్రమల వాహనాల కాలుష్యాన్ని ఆకాశం వైపుగా పంపిస్తున్నాము 
వెలుగు (అగ్ని) మనకు ఎన్నో కార్యాలను చేసుకునేందుకు వీలుగా ఉంటూ మేధస్సులో ఉత్తేజాన్ని విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తూ మళ్ళీ చీకటిని కలిగిస్తూ విశ్రాంతికి (నిద్రకు) తగిన సమయాన్ని అందిస్తుంది 

పంచభూతాలు విశ్వమంతా ప్రకృతిగా వివిధ రూపాలుగా విస్తరించివున్నా ప్రతి కార్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూనే ఉంటాయి పరిశుద్ధతను కలిగిస్తూనే ఉంటాయి పర్యావరణంతో పత్రహరితంతో దివ్యమైన సూర్యకాంతితో ప్రకాశవంతమైన తేజస్సులతో క్రొత్త దనంతో ఉత్తేజాన్ని కలిగిస్తూనే దర్శనమిస్తాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion