ఋతువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఋతువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జనవరి 2017, గురువారం

ఎవరినో ఎక్కడి వాడినో ఎలా ఉండెదనో తెలియదే నా వేద మనస్సుకు

ఎవరినో ఎక్కడి వాడినో ఎలా ఉండెదనో తెలియదే నా వేద మనస్సుకు
ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండగలనో తోచదే నా జీవ జ్ఞాన దేహ మేధస్సుకు  || ఎవరినో ||

పరలోక విశ్వ విధాత ద్వారమున స్వరస్వతిని దర్శించెదను
ఇహలోక విశ్వ విధాత ప్రవేశమున పర బ్రంహను పూజించెదను

బహు మేఘాల గగన పరంపరలలో మహాపర దేవతలనే కొలిచెదను
పాతాళ గంగాజల పరంపరలలో జల దేవ మూర్తులనే స్మరించెదను   || ఎవరినో ||

విశ్వ ప్రకృతి మాతృ మూర్తి భావ తత్వాలనే ధరించెదను
జగతి స్వరూప మహా గుణ ఆకార రూపాలనే తపించెదను

దైవ ప్రభావాల కాల ఋతువుల వసంతములనే స్వీకరించెదను
దేహ జీవముల ఆకార వర్ణ రూపముల కార్యాలతో సాగిపోయెదను   || ఎవరినో || 

20, డిసెంబర్ 2016, మంగళవారం

ప్రకృతిలోనే ఉదయించా ప్రకృతిలోనే జీవించా

ప్రకృతిలోనే ఉదయించా ప్రకృతిలోనే జీవించా
ప్రకృతిలోనే ఎదుగుతూ ప్రకృతిలోనే ఒదుగుతున్నా  || ప్రకృతిలోనే ||

ప్రకృతియే పర భావం ప్రకృతియే పర తత్వం
ప్రకృతియే పర జ్ఞానం ప్రకృతియే పర వేదం

ప్రకృతియే పరమాత్మం ప్రకృతియే పరంధామం
ప్రకృతియే పరిశోధనం ప్రకృతియే ప్రయోగాత్మం

ప్రకృతిలో కలిగే నవ ఋతువుల మార్పులు మనలో పటిష్టం
ప్రకృతిలో కలిగే కాల ప్రభావాల మార్పులు మనలో పరివర్తనం  || ప్రకృతిలోనే ||

ప్రకృతినే జయించు ప్రకృతినే పరిశుద్ధంగా పరిశీలించు
ప్రకృతినే సాగించు ప్రకృతినే మహా కేంద్రంగా నడిపించు

ప్రకృతికై జీవితాన్నే శ్రమించు నీలోని ప్రజ్ఞానాన్నే ఉపయోగించు
ప్రకృతికై జీవనమే సాగించు నీలోని అపార మేధాశక్తినే ప్రయోగించు

ప్రకృతి పర్యావరణమే తరతరాల యుగాల సంపదల ప్రాణాధార ఆహారం
ప్రకృతి వాతావరణ పరిసరాల సమతుల్యత శతాల దశాల జీవులకు కుటీరం  || ప్రకృతిలోనే ||

26, ఆగస్టు 2016, శుక్రవారం

ఋగ్వేదం - ఋతువులను తెలుపునా

ఋగ్వేదం - ఋతువులను తెలుపునా
యజుర్వేదం - యదార్థాన్ని తెలుపునా
సామవేదం - సమానత్వాన్ని తెలుపునా
అధర్వణవేదం - ఆదరించడాన్ని తెలుపునా
చతుర్వేదాలు - నాల్గు వైపుల జీవితాన్ని తెలుపునా