తన్మయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తన్మయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2017, సోమవారం

గమనించవా నా శృతి భావాలను

గమనించవా నా శృతి భావాలను
వినిపించవా నా ధృతి స్వరాలను
ధ్వనించవా నా కృతి తత్వాలను ... హరా హరా!  || గమనించవా ||

స్వరం శృతిస్తున్న గానమే గాత్రం
గళం స్మరిస్తున్న గంధర్వమే ఘనం
శుభం పలుకుతున్న శోభనమే శరణం

దేహం జీవిస్తున్న విధానమే దైవం
దైవం వరిస్తున్న స్వభావమే జీవం
జీవం విహరిస్తున్న తత్వమే గానం  || గమనించవా ||

మోహం తపిస్తున్న కాలమే తపనం
సూక్ష్మం జీవిస్తున్న క్షణమే వినయం
దాహం పలికిస్తున్న గానమే గమకం

వేదం తరిస్తున్న విజ్ఞానమే కమలం
భావం ఫలిస్తున్న మేధస్సే మధురం
తత్వం తిలకిస్తున్న దేహమే తన్మయం  || గమనించవా || 

1, ఫిబ్రవరి 2017, బుధవారం

నీలో హృదయం నాలో గమనం

నీలో హృదయం నాలో గమనం
నీలో తపనం నాలో తరుణం
నీలో భావం నాలో వేదం
ఏనాటిదో ఈ మన చలనం
ఏనాటికైనా రూపమే మధురం ఆకారమే మమకారం  || నీలో హృదయం ||

నీడగా ఉన్నా రూపంలో నాదమే మౌనం
స్నేహమే ఉన్నా దేహంలో ప్రేమే భావం
నిజమే అనుకున్నా మహా సత్యమే నిత్యం
ధర్మమే భావించినా దేహ దైవమే సర్వస్వం  || నీలో హృదయం ||

వేదమే ఉన్నా గానమే గమనం తపనం
నాదమే ఉన్నా గాత్రమే గీతం తరుణం
ధ్యానమే ఉన్నా గమకమే గేయం తన్మయం
భావమే ఉన్నా గంధర్వమే గర్వం వేదాంతం  || నీలో హృదయం || 

6, అక్టోబర్ 2016, గురువారం

బ్రంహోత్సవం బ్రంహోత్సవం జన్మ జన్మల అనుబంధాలకే బ్రంహోత్సవం

బ్రంహోత్సవం బ్రంహోత్సవం జన్మ జన్మల అనుబంధాలకే బ్రంహోత్సవం
బ్రంహోత్సవం బ్రంహోత్సవం తర తరాల అనురాగాలకే ఈ బ్రంహోత్సవం  || బ్రంహోత్సవం ||

శుభ కార్యాల ఉత్సవాలను జరుపుకునేందుకే ప్రతి ఇంట బ్రంహోత్సవం
శుభ ముహూర్తపు కళ్యాణం జరిగేందుకే ప్రతి నివాసంలోనే బ్రంహోత్సవం

తిరుమల గిరి నివాసమున కొలువై ఉన్న శ్రీనివాసునికే నిత్యం బ్రంహోత్సవం
అనంత లోకాలలో లీనమై ఉన్న బ్రంహాండ నాయకునికే మహా బ్రంహోత్సవం

ఊరంతా కలిసి జరుపుకునే మహా దేవుని కళ్యాణ రథోత్సవమే బ్రంహోత్సవం
దేశాలే కలిసి సంతోషంగా జరుపుకునే సంభరమైన ఉత్సవాలే బ్రంహోత్సవం  || బ్రంహోత్సవం ||

మహాత్ముల మహా భావాలతో ప్రతి చోట జరగాలి మహోత్తరమైన బ్రంహోత్సవం
మహర్షుల మహా తత్వాలతో ప్రతి రోజు కలగాలి మహోన్నతమైన బ్రంహోత్సవం

అద్వితీయమైన దైవత్వంతో జరపాలి మహా నాయకుని బ్రంహోత్సవం
అద్వైత్వ దైవాంశంతో యోగత్వ పరతత్వాలతో కలగాలి బ్రంహోత్సవం

అవధూతగా అవతరించే పరంధామయే వచ్చేలా జరపాలి బ్రంహోత్సవం
పరమాత్మయే తన్మయంతో పరవశించి పోయేలా కలగాలి బ్రంహోత్సవం  || బ్రంహోత్సవం || 

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హృదయంలో లేదే నా శ్వాస మేధస్సులో లేదే నా ధ్యాస

హృదయంలో లేదే నా శ్వాస మేధస్సులో లేదే నా ధ్యాస
నాభి నుండి నాసికమున దాగినదే నా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస
దేహములో కలిగినదే చలన భావాల పర తత్వ అభ్యాస      || హృదయంలో ||

నీవే నా శ్వాసగా నేనే నీ ధ్యాసగా ప్రతి సమయం మననం
నీవు నేను ఒకటైతే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పర ధ్యానం
నీకు నాకు కలిగే స్వభావాలే పరమావధీయ పర తత్వం
నీవు నేను ఒకటిగా జీవిస్తే మనలోనే ఒక పర శ్వాస గమనం  || హృదయంలో ||

నా శ్వాసతో జీవించవా నాతోనే జీవితాన్ని పంచుకోవా
నా ధ్యాసతో చలించవా నాతోనే జీవనాన్ని సాగించవా
నా భావనతో తపించవా నాతోనే ఆలోచిస్తూ ప్రయాణించవా
నా తన్మయంతో స్మరించవా నాతోనే కాలాన్ని నడిపించవా  || హృదయంలో || 

27, జులై 2016, బుధవారం

అమ్మగా దీవించు అమ్మమ్మగా ఆశీర్వదించు

అమ్మగా దీవించు అమ్మమ్మగా ఆశీర్వదించు
నీ జీవ రూపానికే ధీర్ఘ ఆయుస్సును కలిపించు  || అమ్మగా ||

నా రూపం విశ్వానికే తపనం తపించుటలో నవ జీవనం
నా భావం జగతికే తన్మయం తలచుటలో నవ వసంతం

విజ్ఞానంతో సాగే ఆలోచన మేధస్సులో అన్వేషణగా వీక్షించే
అనుభవంతో సాగే విజ్ఞానం లోకంలో పరిశోధనగా పరీక్షించే

నా జీవిత కాలం ఒక యుగమై సాగగా నే తెలుపుకుంటాను విశ్వ భావాలను
నా జీవన సమయం ఒక శతమై సాగగా తెలుసుకుంటాను ఆత్మ తత్వాలను  || అమ్మగా ||

నీ ఒడిలోనే నేర్చుకున్నా మహాత్ముల వేద స్వభావ తత్వం
నీ నీడలోనే ఓర్చుకున్నా మహర్షుల కఠిన జీవన మనస్తత్వం

తల్లిగా నా హృదయంలో లీనమై దేవతగా వెలిశావు
అమ్మగా నా మేధస్సులో భావమై మహాత్మగా నిలిచావు

ఆయుస్సుతోనే నా జీవితం ఓ చరిత్రగా సాగే గ్రంథం
కాలంతో సాగే నా జీవనం ఓ చరణముగా సాగే గమకం  || అమ్మగా ||

21, జులై 2016, గురువారం

అమ్మ అనే భావన మేధస్సులో జీవిస్తున్నది

అమ్మ అనే భావన మేధస్సులో జీవిస్తున్నది
తల్లీ అనే వేదన హృదయంలో నివశిస్తున్నది  || అమ్మ అనే ||

జన్మించగా శ్వాసలో తొలి భావన అమ్మే అని
జీవించగా జీవంలో తొలి స్పర్శ తల్లియే అని

అమ్మతో జన్మించడం మధురమైన విశ్వ భావన
తల్లితో ఎదగడం మనోహరమైన దివ్య స్పందన

అమ్మతో జీవించడంలో కరుణామయ తన్మయం
అమ్మతో కొనసాగడంలో దయామయ తరుణత్వం  || అమ్మ అనే ||

అమ్మ అనే పిలుపుతో తన హృదయంలో మరో జీవం ఉదయిస్తుంది
అమ్మ అనే పలుకుతో తన మనస్సులో మరో శ్వాసయే ఎదుగుతుంది

అమ్మకు మనమే మరో ప్రాణమై మన సుఖ సంతోషాలనే కోరుకుంటుంది
అమ్మకు మనమే మరో జీవమై మన విజ్ఞాన అనుభవాలనే పంచుకుంటుంది

అమ్మతో మొదలైన జీవితం మరలా మరో జన్మ మరో అమ్మతోనే జననం
అమ్మతో సాగే జీవనం ఎప్పటికి మరవలేని గొప్ప జ్ఞాపకాల భావన వచనం  || అమ్మ అనే ||