వసంతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వసంతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2017, మంగళవారం

కాలానికి ప్రతి ప్రక్షయం నూతనమైన ఆరంభం

కాలానికి ప్రతి ప్రక్షయం నూతనమైన ఆరంభం
బ్రంహాండానికి ప్రతి యుగం నూతనమైన మహోదయం
యుగానికి ప్రతి శతాబ్దం నూతనమైన నవోదయం
జగానికి ప్రతి దశాబ్దం నూతనమైన జీవోదయం
విశ్వానికి ప్రతి సంవత్సరం నూతనమైన వసంతం
లోకానికి ప్రతి మాసం నూతనమైన అనుభవం
సృష్టికి ప్రతి రోజు నూతనమైన ఉషోదయం 

17, ఆగస్టు 2016, బుధవారం

అప్పుడెప్పుడో కలిగిన పడమటి సంధ్యా రాగం

అప్పుడెప్పుడో కలిగిన పడమటి సంధ్యా రాగం
ఇప్పుడిప్పుడే తోచిన ఉత్తరవాణి గానాల గీతం
వెలిగే వైశాఖం పెరిగే పేరంటం మనలో సంగీతం || అప్పుడెప్పుడో ||

కోకిల పాడే నవ వసంతం రాగాల స్వర గీతం
కోకిల కూసే నవ రాగం స్వరాల సుస్వరాగం

కొమ్మ కొమ్మలలో దాగి చాటున పాడే కోకిలల రాగాలే పేరంటం
చెట్టు చెట్టున చేరి చలాకిగా పాడే కోకిలల స్వరాగాలే సంగీతం    || అప్పుడెప్పుడో ||

ఎప్పటికైనా ఒకే రాగం స్వరాగాలలో మహా వేదం మేధస్సుకే మహనీయం
ఏనాటికైనా ఒకే గీతం సంగీతాలలో మహా జీవం హృదయానికే వైభోగ రాగం

భావాలతో పాడే నవ జీవన రాగం సంధ్య వేళ శుభోదయం
మాటలతో సాగే నవ జీవత వేదం గానంతో సాగే మహోదయం  || అప్పుడెప్పుడో || 

27, జులై 2016, బుధవారం

అమ్మగా దీవించు అమ్మమ్మగా ఆశీర్వదించు

అమ్మగా దీవించు అమ్మమ్మగా ఆశీర్వదించు
నీ జీవ రూపానికే ధీర్ఘ ఆయుస్సును కలిపించు  || అమ్మగా ||

నా రూపం విశ్వానికే తపనం తపించుటలో నవ జీవనం
నా భావం జగతికే తన్మయం తలచుటలో నవ వసంతం

విజ్ఞానంతో సాగే ఆలోచన మేధస్సులో అన్వేషణగా వీక్షించే
అనుభవంతో సాగే విజ్ఞానం లోకంలో పరిశోధనగా పరీక్షించే

నా జీవిత కాలం ఒక యుగమై సాగగా నే తెలుపుకుంటాను విశ్వ భావాలను
నా జీవన సమయం ఒక శతమై సాగగా తెలుసుకుంటాను ఆత్మ తత్వాలను  || అమ్మగా ||

నీ ఒడిలోనే నేర్చుకున్నా మహాత్ముల వేద స్వభావ తత్వం
నీ నీడలోనే ఓర్చుకున్నా మహర్షుల కఠిన జీవన మనస్తత్వం

తల్లిగా నా హృదయంలో లీనమై దేవతగా వెలిశావు
అమ్మగా నా మేధస్సులో భావమై మహాత్మగా నిలిచావు

ఆయుస్సుతోనే నా జీవితం ఓ చరిత్రగా సాగే గ్రంథం
కాలంతో సాగే నా జీవనం ఓ చరణముగా సాగే గమకం  || అమ్మగా ||