మరుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, అక్టోబర్ 2016, మంగళవారం

నీవు ప్రేమించే వరకు నేను నీ ధ్యాసతోనే ఉంటానులే

నీవు ప్రేమించే వరకు నేను నీ ధ్యాసతోనే ఉంటానులే
నీవు ప్రేమిస్తున్నావని తెలిసే వరకు నీతోనే వస్తానులే
నీవు నేను ఒకటైతే నీతో నిత్యం తోడుగానే జీవిస్తానులే  || నీవు ప్రేమించే ||

ప్రేమించే నీ భావనే నాకు ఆనందమైన శుభోదయం
ప్రేమించే నీ తత్వమే నాకు మరవలేని నవోదయం
ప్రేమించే నీ గుణమే నాకు మరుపురాని తేజోదయం

నీ ప్రేమకై నేనే జీవిస్తున్నా ఒక యుగమై వేచివున్నా
నీ ప్రేమకై నేనే వచ్చేస్తున్నా ఒక క్షణమై నిలిచివున్నా
నీ ప్రేమకై నేనే విహరిస్తున్నా ఒక కాలమై వెంటవున్నా  || నీవు ప్రేమించే ||

ప్రేమతో సాగే కాలం ఇద్దరికే తెలియని సాగే సమయం
ప్రేమతో కలిగే భావం ఇద్దరికే తెలియని కలిగే తపనం
ప్రేమతో వెలిగే తేజం ఇద్దరికే తెలియని వెలిగే సహనం

నీ ప్రేమతో నన్ను పలకరించవా నీతో నేనే పులకరించనా
నీ ప్రేమతో నన్ను పిలుచుకోవా నీతో నేనే మలుచుకోనా
నీ ప్రేమతో నన్ను చూసుకోవా నీతో నేనే మనస్సిచ్చుకోనా  || నీవు ప్రేమించే ||

తప్పుకు శిక్షగా శిక్షలో శిక్షణ లేకపోతే మరెన్నో తప్పులు జరిగిపోవును

తప్పుకు శిక్షగా శిక్షలో శిక్షణ లేకపోతే మరెన్నో తప్పులు జరిగిపోవును
పొరపాటుకు సాధనలో సాధించే సాహసం లేకపోతే మరుపు కలుగును
వృధా చేయుటలో మరొకరికి ఉపయోగం లేకపోతే ఎంతో తరిగిపోవును
విశ్వమున నీవు జీవించుటలో క్షమాపణ తెలుపుటకు అవకాశం ఇవ్వకు
లోకమున నీవు మరణించుటచే ఇతరులకు లెక్క సరిపోయిందని కలిగించు
జగమున నీవు ఎదుగుటలో నేర్చినది ఎంతో కాలం ఉపయోగమని భావించు
సృష్టిలో నీవు ప్రయాణించుటలో సమయం అభివృద్ధికేనని చరిత్రను సేకరించు 

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది
ఆలోచనలో ఎరుకే ఉన్నా విజ్ఞానాన్ని మరిపిస్తున్నది

ఏకాగ్రతతో జీవిస్తున్నా క్షణ కాలంలో అజ్ఞానం వరిస్తున్నది
మతి మరుపే నాలో ప్రతి రోజు అజ్ఞానాన్ని వెంబడిస్తున్నది  || నాలో విజ్ఞానం ||

జీవితంతో సతమతమౌతూనే ఎన్నో సమస్యలతో నాలోనే నేను క్షీణిస్తున్నాను
జీవనంతో తడబడిపోతూనే ఎన్నో కార్యాలతో ఉద్రిక్తతకు గురి అవుతున్నాను

మేధస్సులో మహా గొప్ప భావాలున్నా అజ్ఞానమే అధికమౌతున్నది
మనస్సులో మహా గొప్ప స్వభావాలున్నా మరుపే కలుగుతున్నది   || నాలో విజ్ఞానం ||

నిత్యం ధ్యాసతోనే ఉన్నా ధ్యానిస్తునే ఉన్నా కార్యాలతో అజ్ఞానమే
నిత్యం ఎరుకతో ఉన్నా మెలకువతోనే ఉన్నా కార్యాలలో అనర్థమే

ఏనాటికి అజ్ఞానం వదిలిపోతుందో మరణ కాలమే సంభవిస్తున్నది
ఏనాటికి మరుపు విడిపోతుందో మరణమే నన్ను సమీపిస్తున్నది    || నాలో విజ్ఞానం || 

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

పరంధామా! పర బ్రంహ పర దేవో మహేశ్వరః

పరంధామా! పర బ్రంహ పర దేవో మహేశ్వరః
పట్టాభిరామ పర విష్ణు పర లోక దేవో సర్వేశ్వరః
పర తత్వ పర జ్ఞాన పర జీవ దేవో లోకేశ్వరః        || పరంధామా! ||

నాలో అపార అఙ్ఞానాన్నే వదిలించమని ప్రార్థిస్తున్నా
నాలో మతి మరుపునే తొలగించమని వేడుకుంటున్నా

విశ్వ విజ్ఞానం ఉన్నా అజ్ఞానంతో నా జీవితం వృధాగా సాగుతున్నది
వేదాల వేదాంతం ఉన్నా మతి మరుపుతో నా జీవనం తటస్థమైనది   || పరంధామా! ||

వయసై పోతున్నా ఎదుగుదల లేక నాలో నేనే శూన్యమై అణిగిపోతున్నా
కాలం సాగుతున్నా విజయం లేక నాలో నేనే నిర్జీవమై నశించిపోతున్నా

ఏనాటికి ప్రతిఫలం లభిస్తుందో నాలో ఓపిక తరుగుతున్నది
ఏనాడు ఫలితం కలుగుతుందో నాలో జీవం కరిగిపోతున్నది  || పరంధామా! ||

31, ఆగస్టు 2016, బుధవారం

కలే కన్నానని మెలకువ తెలిపేనే

కలే కన్నానని మెలకువ తెలిపేనే
నిజమే కాదని ఉదయంతో తోచేనే
ఎన్నెన్నో కలలు కంటూనే నిద్రిస్తున్నానులే
కలలన్నీ కలలుగానే మిగిలి పోతున్నాయిలే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్నదని మరో ఊహ కలగా సాగుతున్నదిలే
కలే జీవితమని ఊహలతోనే కాలం మరుపుతో సాగేనులే

కల నిజం కాదని తెలిసినా ఊహతో ప్రయత్నమే మొదలాయనే
కల సాధ్యం కాదని తెలిసినా ఓర్పుతో సాధన ఆరంభమయ్యేనే

కలను అందుకోవాలని మనస్సులో కోరిక పుట్టేనే
కలను జయించాలని మేధస్సులో ఆలోచన తట్టేనే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్న వేళ మదిలో సంతోషమే కలిగేనే
కలే నిజమౌతున్న వేళ యదలో ఆనందమే ఉప్పొంగేనే

అన్నీ కలలు తీరవు అన్నీ కలలు మనకు గుర్తుగా ఉండవు
అన్నీ కలలు మంచివి కావు అన్నీ కలలు ఒకటిగా ఉండవు

ఆలోచిస్తేనే భావంతో కల ఎటువంటిదో తెలిసేను  
ఊహతో నెమరువేస్తేనే కల ఏమని అర్థమయ్యేను  || కలే కన్నానని || 

6, మే 2016, శుక్రవారం

మేధస్సులో మరుపే ఉన్నా నిద్రించడం ఎందుకో

మేధస్సులో మరుపే ఉన్నా నిద్రించడం ఎందుకో
నిద్రలేని మేధస్సు విశ్రాంతి లేని బలహీనతతోనే
మరుపే లేని మేధస్సు మానవ జీవికి మైమరుపే
మైమరుపులోనే నిద్ర ఆసన్నమై మరుపే కలిగేనే
ఏకాగ్రత లేని మేధస్సు విజ్ఞానం లేని మరుపుతోనే
మరుపు ఉన్నా లేకున్నా శక్తి కోసం నిద్రించడమే
విశ్రాంతితో సామర్థ్యం కలిగి ఏకాగ్రతతో మరుపు తరిగేనే
మరుపు తరిగినచో విజ్ఞానం అధికమై ఉత్తేజమగునే
ఉత్తేజముతో జీవితం అద్భుతమై మేధస్సు జ్వలించునే

4, మే 2016, బుధవారం

విశ్వములో కలిగే మరుపు విశ్వ కాలంతో సాగే భావన

విశ్వములో కలిగే మరుపు విశ్వ కాలంతో సాగే భావన
భావనతో సాగే ఆలోచన మేధస్సులో దాగిన సద్భావన
భావాలతో సాగే మేధస్సు విశ్వ కాలంతో కలిగే మరుపే
అనంతమైన ఆలోచనలలో జ్ఞాపకము లేనివే మరుపు
కాస్త మరుపుతో మరెన్నో ఆలోచనలు మేధస్సులో కలిగే
మరుపుతో మరెన్నో కొత్త ఆలోచనల అన్వేషణ  ఆరంభం
ఆలోచనలలోని మరుపు విశ్వ కాలంతో సాగే అజ్ఞానము
మరుపులోని అజ్ఞానము జ్ఞాపకములోని విజ్ఞానము 

20, అక్టోబర్ 2015, మంగళవారం

మానవ మేధస్సుకు మరుపేలా మహానుభావా!

మానవ మేధస్సుకు మరుపేలా మహానుభావా!
మరుపుతో ఎన్నో ఆలోచనలు మరచి పోయెదమే
మరుపుతో మంచి ఉన్నది అనర్థము ఉన్నది
అవసరమైనది ఎప్పటికీ మరచిపోతే నిరుపయోగం
చాలా కాలానికి జ్ఞాపకమైనా అవసరం లేకపోతే శూన్య ప్రయోజనమే
సరైన సందర్భానికి గుర్తు వస్తే మరచుట తాత్కాళికమైన ఉపయోగమే
మరుపుతో మేధస్సులలో అజ్ఞాన విజ్ఞాన భావాలు అనంత సదృశం
తాత్కాళిక మరుపుతో విజ్ఞాని శాశ్విత మరుపుతో అజ్ఞానిగా మారవచ్చు
ఏ మరుపులో ఏ మర్మం ఉన్నదో జ్ఞాపకాల మంత్రానికే తెలియాలి
కావలసిన దానిని పదే పదే గుర్తు చేసుకుంటే విజ్ఞానంగా ఎదుగుతాము
అనవసరమైన దానిని పదే పదే మరచిపోతుంటే విజ్ఞానాన్ని సమకూర్చుకోవచ్చు
మరుపు ప్రతి జీవికి అవసరం అందులోనే విశ్రాంతి భవిష్య ఆలోచనలు కలుగుతాయి
ఎంత మరుపు ఉన్నా విజ్ఞాన ఉత్తేజంతో కార్య సాధన చేస్తే మహానుభావులవుతాం 

9, అక్టోబర్ 2015, శుక్రవారం

మరుపుతో మహా విజ్ఞాన జీవితాన్ని అందుకోలేక పోయాను

మరుపుతో మహా విజ్ఞాన జీవితాన్ని అందుకోలేక పోయాను
సరైన సమయానికి తెలుసుకోలేక మరుపుతోనే సాగిపోయాను
మరుపుతో మేధస్సు అజ్ఞానమైనట్లు జీవితం విచారమైనది
విచారంతో సాగే జీవితం ఉత్తేజం లేని మేధస్సుగా సాగినది
విజ్ఞాన ఆలోచనలు తోచలేక లేదా అమలులో లేక ఇక్కట్లే
ఎదిగే మేధస్సుకు విజ్ఞాన సాధన లేకపోతే మరుపేగా
విజ్ఞాన ఆలోచనలతో జీవిస్తేనే మేధస్సు బ్రంహాండం అవుతుంది
దీర్ఘ కాలపు మరుపుతో జీవితం విచారంగా సాగిపోయినది
విజ్ఞాన జీవితాన్ని అందుకోలేని వారు ఉపాయంతో జీవించాలి
ఎరుకతో ఆలోచిస్తూ విజ్ఞానంతో ఏకాగ్రత వహిస్తూ అనుభవంతో సాగాలి 

ఎప్పుడు మరుపు కలిగినదో గాని యుగాల తర్వాత

ఎప్పుడు మరుపు కలిగినదో గాని యుగాల తర్వాత మెలకువలో తెలిసినది
మరచిన విజ్ఞానం మేధస్సులో మళ్ళీ కలగక ఎన్నో యుగాలే గడచిపోయేనే
మరుపులో మర్మం ఉన్నదో మేధస్సులో మంత్రం ఉన్నదో ఎరుకకైనా తెలియదే
మరుపులేని మేధస్సుకై అన్వేషించినా అలసటలో ఆలోచనలే మారి పోయేనే
అలసటతో కలిగే మరుపు ఆలోచనతో కలిగే మరుపు మేధస్సులోనే మంత్రమాయే
మరుపుతో జీవించే మేధస్సుకు విజ్ఞానం ఒక అఖండమైన సాధనయే
ధ్యాస లేని ఆలోచనలతో ఎరుకను మాయ చేసే మనస్సు అజ్ఞాన మంత్రమేగా
సాధనలో సాగే అన్ని ఆలోచనలు విజ్ఞానమైతే ఎరుకతో కూడిన అనుభవమే
సాధనలో కలిగే విఫలాలు అనుభవాలు లేని అజ్ఞాన మరుపు ఛాయలే
సరైన సమయానికి ఆహారం నిద్ర విశ్రాంతి తీసుకుంటే మరుపు ఓ విజ్ఞాన ఉత్తేజమే 

మరుపుతోనే మహా ఆనందమైన జీవితాన్ని మరిచాను

మరుపుతోనే మహా ఆనందమైన జీవితాన్ని మరిచాను
మరుపుతో అజ్ఞానంగా ఆలోచిస్తూ మేధస్సునే మరిచాను
విజ్ఞానం లేని మేధస్సులో ఎరుక లేక అజ్ఞానంతో జీవించాను
అలసట చెందే మేధస్సుకు అజ్ఞానపు మరుపు ఎందుకు కలిగెనో
అలసట చెందే మేధస్సుకు విజ్ఞానపు ఆలోచన ఎలా తప్పి పోవునో
విశ్రాంతికై మేధస్సులో మరుపు కలిగేలా మరో ఆలోచన ఎలా వచ్చునో
ఎక్కడ నుండి మరుపు కలుగునో మేధస్సుకే విచారమై అజ్ఞానమే ఆవహించేనా
మేధస్సులో నిత్యం ఆలోచించే ఎరుక లేనందున మేధస్సుకు మరుపేనా 

నరుడా! మేధస్సున మరుపు ఎలా కలుగునో తెలుసుకోవా

నరుడా! మేధస్సున మరుపు ఎలా కలుగునో తెలుసుకోవా
మరచిన విజ్ఞానంతో మేధస్సున విచారమే మొదలాయనే
విచారంతో మేధస్సులో ఉత్తేజం లేక దేహం అవస్థగా మారెనే
అలసట చెందిన మేధస్సుకు విశ్రాంతి కోసమే మరుపు కలిగేనా
అవసరమైన భావన లేక అనవసరాన్ని ఆలోచించగా కలిగేనా
అనవసర ఆలోచనలలో దీర్ఘ కాలంగా సమయాన్ని వెచ్చిస్తే మరుపేనా
అనవసర భావాలలో ఎరుక లేక అజ్ఞానమే మేధస్సుకు కలిగేనా
మరుపుతో మంచి కలిగితే మేధస్సులో మహానంద ఉత్తేజమే
మరుపుతో అశుభం కలిగితే దేహ మేధస్సులో చంచలనమే
ఎప్పటికైనా మేధస్సును ఎరుకతో ఆలోచించేలా అనుభవించరా
మరుపులోనే అజ్ఞానం అఖండమై అమాంతం ఆవహించెనే నరుడా!