కదలిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కదలిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఆగస్టు 2017, బుధవారం

జీవితం చాలని జీవనం సాగుతున్నదా మనలో

జీవితం చాలని జీవనం సాగుతున్నదా మనలో
వేదం చాలని విజ్ఞానం సాగుతున్నదా మనలో
తెలుసుకో ఒక రూపమై తెలుపుకో ఒక ఆత్మవై   || జీవితం ||

శరీరానికి కదలిక చాలని  
దేహానికి ఆహారం చాలని
ఆలోచనకు విజ్ఞానం చాలని

కాలమే తెలిపేను ఏదైనా కొంతవరకే చాలని   || జీవితం ||

మేధస్సుకు భావనం చాలని
హృదయానికి ప్రసరణ చాలని
వయస్సుకు అనుభవం చాలని

సమయమే తలచేను ఎంతైనా కొంతవరకే చాలని   || జీవితం ||