30, జులై 2026, గురువారం

తనకు తెలిసిన విజ్ఞానాన్ని తనకు తానుగా పరిశోధనతో వ్రాసుకుంటూ సాధన చేస్తున్నాడు

తనకు తెలిసిన విజ్ఞానాన్ని తనకు తానుగా పరిశోధనతో (చేస్తూ) వ్రాసుకుంటూ సాధన చేస్తున్నాడు  
తనకు తెలిసిన విజ్ఞానంతో అలాగే జీవిస్తే అది అర్థాన్ని ఇస్తుంది అదే పరిశోధన చేస్తూ సాగితే సాధనతో పరమార్థాన్ని తెలుపుతుంది 

జీవించడంలో ఏ అర్థం తెలిసినా విజ్ఞానంగా ఎదుగుటలో పరమార్థం గొప్పగా తెలిసివుండాలి 

ఎవరికి వారు గొప్ప అని ఎవరికి వారు అనుకుంటే అందరికి తెలిసేది అర్థమే గాని పరమార్థం కాదు 
ఎవరికి ఏది తెలిసినా మనకు తెలిసిన దానిని పరిశోధన చేస్తూ మహా విజ్ఞానంతో గొప్ప అనుభవాలతో కార్య జ్ఞాన సాధనతో పరమార్థాన్ని గ్రహించాలి ప్రధానమైన సారాంశాన్ని తెలుసుకోవాలి 

జీవన విధానంతో తెలిసే అర్థం ఒక విధంగా ఆధ్యాత్మిక విధానంతో తెలిసే పరమార్థం మరో విధంగా ఉంటుంది 

శ్రమలో సహనం కోల్పోతే శ్రమనే సేవగా స్మరించుకుంటే ఆ అర్థం పరమార్థంతో పరిపూర్ణమైన పరమాత్మమై పరిశుద్ధమై సాగిపోతుంది 

నేడు మనం ఉపయోగిస్తున్న యంత్రాలన్నీ తనకు తానుగా వ్రాసుకుంటూ సుదీర్ఘంగా ప్రయోగాలను సాగిస్తూ రూపకల్పన చేసుకున్న పరిష్కార విధానమే 
యంత్రమే కాదు యంత్ర పరి భాషలు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఉద్భవిస్తూనే ఉన్నాయి 

ఆనాడు ప్రకృతి నుండి ప్రత్యుత్పత్తి జరిగేవి నేడు యంత్రముల నుండి వివిధ వస్తవులు ఉత్పత్తి అవుతున్నాయి 

విజ్ఞానాన్ని ఎలా చెప్పుకున్నా ఎంత తెలుసుకున్నా ఏది నేర్చుకున్నా ఏమని గ్రహించినా మేధస్సులో కొరతగా ఉంటుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి