విజ్ఞానం మాత్రమే అద్భుతంగా ఉంటే సరిపోదు కావలసినంత ఐశ్వర్యం ఉంటేనే జీవితం సుకృతం అవుతుంది
విజ్ఞానం కోసం శ్రమించినట్లు ఐశ్వర్యం కోసం ఎంతో శ్రమించాలి విజ్ఞానాన్ని ఎదుగుటకు ఉపయోగించుకోవాలి
ఐశ్వర్య అభివృద్ధి లేని విజ్ఞానం ఎంతటి అద్భుతమైనా జీవించుటలో ఎంతో లోపం అధికమవుతూనే (కలుగుతూనే) ఉంటుంది
ఐశ్వర్యం ఉంటేనే బంధంతో జీవితాన్ని సాగిస్తూ అవసరమయ్యే వాటిని సమకూర్చుకుంటూ సాగిపోతున్నాము
ఐశ్వర్యం లేని జీవనం ఒంటరి జీవితమై ఒంటరి పోరాటమై ఒంటరి ఆలోచనతో ఒంటరి విజ్ఞానమై ఒంటరిగానే మిగిలిపోతుంది
సుఖమేదో సంతోషమేదో శ్రమ ఏదో జ్ఞానమేదో బంధం ఏదో సంభ్రమం ఏదో సమయమేదో తెలిసినా తెలియకుండానే పోతుంది మన కోసం ఏ ప్రత్యేకత ఏ పిలుపు ఏ ఆహ్వానం ఎవరి ఆలోచనలలో ఎక్కడ లేకుండా పోతుంది
ఐశ్వర్యంతో ఎంతగా ఎదిగినా అంతగా గౌరవిస్తూనే నీ కోసం ఆరాధిస్తూ నిన్ను అన్ని వేళలలో గొప్పగా ఆహ్వానం చేసుకుంటారు చిన్న కార్యములైనా మహా కార్యములైనా నీతోనే సాగేలా ఎంతో గొప్పగా సంభ్రమం చేసుకుంటారు
ఐశ్వర్యంతో జీవితాన్ని ఎంతో మహోత్తరంగా ఉత్సవంగా ఉన్నతంగా మహా ఉత్సాహ భరితంగా సాగించవచ్చు
-- వివరణ ఇంకా ఉన్నది
No comments:
Post a Comment