మరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2017, గురువారం

మరణమిదే మనస్సు తలచిన సమయమిదే

మరణమిదే మనస్సు తలచిన సమయమిదే
మేధస్సుకే తెలిసి తెలియని భావ తత్వమిదే

జీవమిదే శ్వాస తపించిన ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఇదే
దేహమిదే హృదయం తెలిపే పర ధ్యాన గమనమిదే   || మరణమిదే ||

ఏనాడో జన్మించిన కాలం మరణాన్నే మరచిన సమయం ఏదో
ఏనాడో తలచిన మరణం ఏనాటికో తెలియని సందర్భం ఏదో

జీవించే శ్వాసపై ధ్యాసతో గమనమై జీవించేస్తున్నా
తపించే హృదయమే ధ్యాన గమ్యమై ప్రయాణిస్తున్నా   || మరణమిదే ||

తెలియనివి ఎన్నో తెలియుట కొరకే తపనమే సాగుతున్నది
తెలిసినవి ఎన్నో తెలుపుట కోసమే తరుణమే వెళ్ళుతున్నది

ఎన్నెన్నో నేర్చిన వన్నీ మరణ సమయాన్ని తపించలేదే
ఎన్నెన్నో మరచిన వన్నీ మరణ భావత్వాన్ని తెలుపలేదే   || మరణమిదే || 

30, మార్చి 2017, గురువారం

మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏమౌతున్నానో

మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏమౌతున్నానో తెలియుట లేదు ఎలా వెళ్ళాలో తోచటం లేదు
మరణించిన రూపం నశించిపోతున్నా నా విశ్వ విజ్ఞాన భావాలు పర ధ్యాసతో జగతిలోనే సాగుతున్నాయి
ఉదయించే సూర్యుడు అస్తమిస్తున్నా మరల ఉదయించునట్లు నా విజ్ఞాన భావాలు ఉదయిస్తున్నాయి
ప్రకృతిలో పంచ భూతాలుగా నశించిపోతున్నా మళ్ళీ పంచ భూతాల ప్రకృతిగా నిత్యం చిగురిస్తున్నాను
విశ్వ భావాలకు భవిష్య కాలానికి మరణం లేదు నా గుణ విజ్ఞాన పర వేద తత్వాలకు నిలకడ ఉండదు
తరతరాలకు తరగని ఆలోచనల పరిశోధనలు భావ స్వభావ తత్వాలకు అద్భుతమైన అమర నైపుణ్యములు
అణువుగా ఉదయిస్తున్నా పరమాణువుగా పరిశోధిస్తున్నా విశ్వ భావాల మేధస్సుతో విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నా 

27, మార్చి 2017, సోమవారం

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో
నడిచిపో నీ గమ్యాన్ని తలచిపో నీ గౌరవాన్ని సజీవంతో    || విడిచిపో ||

జీవించే కాలం తెలుసుకునే సమయం మన జీవితానికే
నడిపించే కార్యం సాగించే సహనం మన జీవన వృద్ధికే

ఎంత కాలం జీవిస్తున్నా మన ఆకార రూపం తరుగునని
ఎంత జ్ఞానం పొందుతున్నా మన అనుభవం చాలదని   || విడిచిపో ||

ఉన్నప్పుడే కాస్త తీరిక చేసుకో ఉన్నంతలో ఊపిరి పీల్చుకో
ఉన్నట్లుగా జీవం సాగించుకో ఉంటూనే ఊహను చూసుకో

ఉదయించేది ఏదైనా అస్తమించేనని జన్మించిన నీకు మరణం తప్పదని
నీకోసం ఉన్నది ఏదైనా సొంతం కాదని సంపాదన ఖర్చులకే పరిమితమని   || విడిచిపో || 

23, మార్చి 2017, గురువారం

మరణం తెలిసిందా ప్రయాణం ముగిసిందా ఉదయం అస్తమించిందా

మరణం తెలిసిందా ప్రయాణం ముగిసిందా ఉదయం అస్తమించిందా
ప్రాణం నిలిచిపోయిందా మౌనం కలిగిందా హృదయం ఆగిపోయిందా

జీవితం అంతమౌతుందా  సందర్భం తెలిపిపోతుందా జీవనం నిలిచిపోతుందా
సమయం చెప్పి వస్తుందా కాలం తలచి పోతుందా తరుణం తపించి పోతుందా  || మరణం ||

శరణం లేని జీవితం అభయం లేని జీవనం ప్రశాంతమై కదిలేనా
విజ్ఞానం లేని గమనం ఉపయోగం లేని కార్యం సుఖాంతమై సాగేనా

భావమే లేని తత్వంతో స్పర్శ లేని స్వభావంతో మరణము సంభవించేనా
వేదమే లేని విజ్ఞానంతో మౌనమే లేని హృదయంతో మృత్యువు ఆవహించేనా  || మరణం ||

కారణం లేని కార్యం పరమార్థం లేని అర్థం పరిశోధన లేని పర్యవేక్షణ ఆగేనా
కాలం లేని కర్తవ్యం రూపం లేని ఆకారం దైవం లేని ధర్మం నిత్యం నిలిచేనా

ధైర్యం లేని జీవనం కోరిక లేని జీవితం విజ్ఞానం లేని కార్యం అంతమయ్యేనా
రక్షణ లేని జీవం శ్వాస లేని రూపం శాంతం లేని హృదయం నిలిచిపోయేనా  || మరణం || 

21, మార్చి 2017, మంగళవారం

మరణాన్ని మరచేందుకా మన కార్యాల ప్రయాణం

మరణాన్ని మరచేందుకా మన కార్యాల ప్రయాణం
మరణాన్ని తొలచేందుకా మన ఆలోచనల విజ్ఞానం
మరణాన్ని విడిచేందుకా మన ఆహారముల ఆరోగ్యం
మరణాన్ని పంపించేందుకా మన భావ స్వభావాల తత్వం  || మరణాన్ని ||

మరణమే లేదనుకో నీ కార్యాలతో ముందుకు సాగిపో
మరణమే కాదనుకో నీ ఆహారములతో ఆరోగ్యం చూసుకో
మరణమే వద్దనుకో నీ ఆలోచనలతో విజ్ఞానం పెంచుకో
మరణమే రాదనుకో నీ భావాలతో తత్వాలను గ్రహించుకో

మరణం ఎలా వస్తున్నా పరిశోధనతో దేహాన్ని రక్షించుకో
మరణం ఎలా చూస్తున్నా పరిశీలనతో రూపాన్ని సాగించుకో    || మరణాన్ని ||

మరణం ఎప్పుడు సంభవించినా ఎదురించే సామర్థ్యం పెంచుకో
మరణం ఎక్కడ ఆవహించినా పోరాటంతో ధైర్యాన్ని నింపుకో

మరణం ఎవరితో వస్తున్నా ప్రశాంతతో శ్వాసను ఉంచుకో
మరణం ఎవరితో పోతున్నా పరధ్యాసతో జీవాన్ని బంధించుకో

మరణం ఏదైనా ఆత్మ ప్రశాంతతో సాగిపో
మరణం ఏమైనా జీవ శాంతంతో వెళ్ళిపో    || మరణాన్ని || 

9, ఫిబ్రవరి 2017, గురువారం

ఏనాటిదో మరణం ఎప్పటి వరకో శరణం

ఏనాటిదో మరణం ఎప్పటి వరకో శరణం
ఏనాటిదో జననం ఎప్పటి వరకో జీవితం

జన్మించిన నాటి క్షణము నుండి తల్లి రక్షణమే కవచం
మరణించిన నాటి క్షణము నుండి పర లోకమే శరణం   || ఏనాటిదో ||

మరణంతో దేహం పంచ భూతాలుగా కలసినా శూన్యమే ధర్మం
జననంతో శరీరం పంచ భూతాలుగా వెలసినా విజ్ఞానమే సత్యం

మరణంతో మేధస్సులో నిండిన విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలు పర బ్రంహ లోకానికే అంకితం
మరణంతో దేహంలో దాగిన ఆత్మ పరంజ్యోతి పరమాత్మగా పర విష్ణు వైకుంఠ లోకానికే సర్వాంకితం
మరణంతో శరీరంలో ఆగిన ఉచ్చ్వాస జీవ పరంధామగా పర ఈశ్వర కైలాస లోకానికే జగతాంకితం    || ఏనాటిదో ||

మరణాన్ని జయించడం వేద విజ్ఞాన సత్య ధర్మాలను అధిగమించడం
జననాన్ని కోరుకోవడం విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలను ధరించడం

జననంతో ప్రతి క్షణం ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పోరాటమే దేహానికి సౌఖ్యం
జననంతో ప్రతి క్షణం హృదయ చలన తత్వాల సమరమే దేహానికి సౌలభ్యం
జననంతో ప్రతి క్షణం మేధస్సు ఆలోచన భావాల ఉపోద్ఘాతమే దేహానికి సౌభాగ్యం  || ఏనాటిదో || 

27, డిసెంబర్ 2016, మంగళవారం

ఏ బంధాలు లేకుండా మహాభారత కురుక్షేత్ర ధర్మ యుద్ధం జరిగిందా

ఏ బంధాలు లేకుండా మహాభారత కురుక్షేత్ర ధర్మ యుద్ధం జరిగిందా
బంధాలన్నీ అశాశ్వితమైన జీవన పరిణామాలేనని రణ రంగం సాగిందా
రంగ స్థలమైనా రణ రంగమైనా విజయమే మహా లక్ష్యమంటూ సాగిందా
మరణం భయమని తెలియకుండానే ఎన్నో రాజ్యాల పోరాటం సాగిందా
ఎవరికి వారు గొప్పవారంటూ ఇరు రాజ్యాల శతృత్వం యుద్దమై సాగిందా
ముగింపు తెలియని రాజ్యాల పరిపాలన భవిష్య ప్రగతికై రణమే సాగిందా
విభేదాల ప్రసక్తి ప్రచారాల ప్రభావమై దేశ ప్రదేశాలకై రణరంగం సాగిందా 

22, డిసెంబర్ 2016, గురువారం

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో
సాధనతో సాధించే ప్రయత్నం చేసుకో

తెలిసినదే జ్ఞాపకం చేసుకో తెలియనిదే గమనంతో తెలుసుకో
తెలియకపోతే తెలిసిన వారితో చర్చిస్తూ ఓపికతో ఎంతో నేర్చుకో  || మరణం ||

నీ మేధస్సులో ఎంతో విజ్ఞాన ప్రదేశం ఖాళీగా ఉందని తెలుసుకో
నీ మేధస్సులో ఎంతో ఆలోచనల ప్రవాహం సాగునని తెలుపుకో

నీ  మేధస్సులో ఉన్న అపారమైన విజ్ఞానాన్ని జ్ఞాపకంగా దాచుకో
నీ మేధస్సులో దాగిన విజ్ఞానాన్ని ఉత్తేజమైన మేధాశక్తిగా చేసుకో

నీ మేధస్సులో అన్వేషణ మొదలైతే విశ్వ భావ జీవ రహస్యాలెన్నో చేర్చుకో
నీ మేధస్సులో వేదాంతం ప్రారంభమైతే లోక జ్ఞాన వేదత్వాలెన్నో లెక్కించుకో  || మరణం ||

నీలో జీవించే ప్రాణ శక్తిని స్వధ్యానంతో దీర్ఘాయుస్సుగా మార్చుకో
నీలో ధ్వనించే జీవ శక్తిని స్వర నాదంతో దీర్ఘ కాలంగా సాగించుకో

నీవే మహా వేదమై మహాత్మగా ఎదుగుతూ పరలోకాన్ని అర్థం చేసుకో
నీవే మహా తత్వమై మహర్షిగా ఒదుగుతూ పరమార్థాన్ని గ్రహించుకో

నీవే అణువై ఓ పరమాణువుగా పరిశోధించి సూక్ష్మ జ్ఞానాన్ని పెనవేసుకో
నీవే పరమాణువై మహా అణువుగా పర్యవేక్షించి విజ్ఞానాన్ని పెకలించుకో  || మరణం || 

12, డిసెంబర్ 2016, సోమవారం

మరణం సమరంతో మరణం

మరణం సమరంతో మరణం
మరణం యుద్ధంలో మరణం
మరణం పోరాటంలో మరణం
మరణం రణరంగంలో మరణం
మరణం మహా యోధుల సంగ్రామం  || మరణం ||

మరణంతో లోకం అంతం
మరణంతో విరోధం క్షీణం
మరణంతో రాజ్యం పతనం
మరణంతో సైన్యం శూన్యం
మరణంతో జగడం సఫలం
మరణంతో దేశం రాహిత్యం
మరణంతో సామ్రాజ్యం లోపం
మరణంతో శతృత్వం దహనం
మరణంతో సంగ్రామం శాంతం  || మరణం ||

మరణంతో గతం చరిత్రం
మరణంతో వంశం విరోధం
మరణంతో స్వదేశం భారం
మరణంతో కాలం నూతనం
మరణంతో ప్రదేశం తిలకం
మరణంతో జనం అన్యాయం
మరణంతో అధికారం మోసం
మరణంతో ఆధిపత్యం విరుద్ధం
మరణంతో జగం పునః ప్రారంభం   || మరణం || 

8, ఆగస్టు 2016, సోమవారం

కైలాశ వాసా వైకుంఠ వాసా పరలోక వాసా కరుణించవా

కైలాశ వాసా వైకుంఠ వాసా పరలోక వాసా కరుణించవా
నా శ్వాసలో నీ ధ్యాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాస

ధ్యానించే నీ ధ్యాసలో నా శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాల హంస ద్వార ప్రయాస
జీవించే నా శ్వాసలో ప్రతి యాస నీ ధ్యాస గమనాల ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాల త్రాస

ప్రతి జీవి యాస ప్రయాస మరణంతో త్రాస జన్మతో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస
ప్రతి జీవి ధ్యాస శ్వాస జననంతో హంస మరణంతో మరో జన్మకు ఉల్లాస  || కైలాశ వాసా ||

జీవితాన్ని వెలిగించే జీవం నీవే జీవనాన్ని సాగించే దైవం నీవే
సత్యాన్ని చూపించే మర్మం నీవే ధర్మాన్ని రక్షించే యోగం నీవే

కరుణించి దయచూపే విశ్వ భావాల జీవ శ్వాసవు నీవే
మెప్పించి మై మరిపించే వేద విజ్ఞాన ఉప జ్ఞానం నీవే  || కైలాశ వాసా || 

జీవం ఒక్కటే శ్వాసలో ఊపిరి ఒక్కటే

జీవం ఒక్కటే శ్వాసలో ఊపిరి ఒక్కటే
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ధ్యాస ఒక్కటే
ప్రతి జీవిలో జీవించే శ్వాస భాష ఒక్కటే  || జీవం ||

దైవంతో సాగే దేహానికి శ్వాస ప్రాణమే
జీవంతో సాగే శరీరానికి ధ్యాస ధ్యానమే

స్వరముతో ఎదిగే శ్వాసకు ఆకలి ఒక్కటే
జ్ఞానంతో పెరిగే మేధస్సుకు భావన ఒక్కటే

ఆలోచనలలో విచక్షణ మాటలలో ఉచ్ఛరణ విజ్ఞానమే
ధ్యాసలో గమనం శ్వాసలో తపనం సద్గుణమైన జ్ఞానమే  || జీవం ||

ఎరుకతో సాగే జీవికి సాధన విజయమే
వచనంతో సాగే ప్రాణికి జ్ఞానం సత్యమే

నిత్యం ధ్యానించే శ్వాసకు ధ్యాస ఎప్పటికి ఒక్కటే
నిరంతరం శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఒక్కటే

సమయానికి కాలానికి కలిగే క్షణం ఒక్కటే
జన్మకు మరణంకు జీవించే జీవం ఒక్కటే   || జీవం || 

29, జులై 2016, శుక్రవారం

అమ్మగా జీవాన్ని పోశావు తల్లిగా నీ రూపాన్ని పెంచావు

అమ్మగా జీవాన్ని పోశావు తల్లిగా నీ రూపాన్ని పెంచావు
విశ్వంతో బంధాన్ని కలిపించి జగతికే పరిచయించావు  || అమ్మగా ||

నీ కోసమే నేను జీవిస్తూ నిత్యం తపిస్తూ జీవనాన్ని సాగిస్తున్నా
కష్టాల నష్టాలు దుఃఖాలుగా ఎన్ని ఎదురైనా వెనుకడుగే లేదే

విజ్ఞానముకై లోకాన్నే సంచరించా అనుభవముకై సందేశాన్ని సేకరించా
జీవన విధానముల సమస్యలతో ఒదిగిపోయి పరిస్థితులతోనే ఓర్చుకున్నా

నేటి జీవన విధానమున సమస్యలు ఎన్నో సరికాని కార్యాలు ఎన్నెన్నో
నేటి కాల జీవితం వృధాగా సాగే శ్రమ శూన్యమయ్యే ఫలితం మరణంలా  || అమ్మగా ||

ఎదగాలని ఉన్నా ఎన్నో పరిస్థితులు అడ్డంకులుగా దరిచేరుతున్నాయి
ఎంత కాలం వేచివున్నా సరైన పరిపాలక వ్యవస్థ రాలేని ధనాశత్వము

మరణం వరకు నాలో విజ్ఞానాన్ని పెంచుకుంటూ చరిత్రకు సూచనగా మిగిలిపోతా
విశ్వమే నిలిచే వరకు నా భావాలతో కాల జ్ఞానంగా జగతికి మార్గదర్శంగా సాగిపోతా

ఉదయించే సూర్యునితోనే నా విజ్ఞానాన్ని ఆకాశానికి మేఘ వర్ణాలతో తెలుపుకుంటాను
అస్తమించే సమయంతోనే నా భావ తత్వాలను సృష్టికి నిర్వచనముగా మిగిలిపోతాను  || అమ్మగా || 

27, జులై 2016, బుధవారం

మరణించే మహాత్ముల మేధస్సు నాలో ఆలోచనలై సాగునులే

మరణించే మహాత్ముల మేధస్సు నాలో ఆలోచనలై సాగునులే
అస్తమించే మహర్షుల విజ్ఞానం నా భావాలలో కొనసాగిపోవునులే  || మరణించే ||

మహానుభావుల మహా విజ్ఞానం జగతికే తెలిసిన తన్మయం
మేధావుల మహా జ్ఞానం లోకానికే తెలియని వేదాల తపనం

మానవుడే మాధవుడై జీవించే లోకమే ఈ జగతి
మాధవుడే మహాత్మగా వీక్షించే విశ్వమే ఈ సృష్టి

ప్రతి క్షణం ఒక నిరీక్షణగా తపించే జీవన కాలమే ఋషి వర్యం
ప్రతి సమయం ఒక ధ్యాసగా తలిచే జీవిత కాలమే ఆత్మ స్థైర్యం   || మరణించే ||

ఉదయించే జీవుల విజ్ఞానం అస్తమించుటలో వృధాగా మారే కాలంతరం
విజ్ఞానమే లేకున్నా అజ్ఞానిగా జీవించే సమయం అనర్థమయ్యే తరుణం

అనుభవమే ఓర్చుకునే తత్వాన్ని కలిగిస్తూ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నది
అనుబంధమే నేర్చుకునే తత్వమై నవ భావ జీవన విధానాన్ని వెంబడిస్తున్నది

మరణంతో రూపం వెళ్ళినా జ్ఞానంతో భవిష్య జీవులలో స్థిరంగా ఉండగలను
అస్తమించుటతో సమస్తం నిలిచిపోయినా నా విజ్ఞానం కాలంతో ఉండిపోవును  || మరణించే ||

26, జులై 2016, మంగళవారం

అస్తమించే మరణం మళ్ళీ ఉదయించే జీవం

అస్తమించే మరణం మళ్ళీ ఉదయించే జీవం
అరుణోదయమే మళ్ళీ ఉషోదయమైన జీవితం || అస్తమించే ||

మరణాస్తమయమే జన్మోదయమయ్యే జీవుల జీవితమే జగతికి విశ్వ కాలం
మరణం జన్మిస్తుందనే జీవాస్తమయం జీవోదయంగా సాగేలా మన తరుణం

మహా గొప్పగా జీవిస్తున్నా మహాత్మగా ఉదయిస్తున్నా మరణంతో శూన్యం
మహా దివ్యంగా జన్మిస్తున్నా ఆత్మగా అస్తమించే ఉదయమే అఖిలత్వం  || అస్తమించే ||

ఉదయం అస్తమయం ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ఆత్మ జీవితం
జననం మరణం జీవించుటలో రాకపోకలుగా జీవులకు తధ్యం

కిరణంతో ఉదయించే సూర్య తేజము చీకటితో అస్తమించే ఆకాశ వర్ణం
వెలుగుతో సాగించే పగలు చీకటితో మాయం చేసే నేత్ర భావన తత్వం  || అస్తమించే || 

7, జులై 2016, గురువారం

మరణంతో మౌనమై విశ్వంతో ఏకమై నిశ్చల ఏకాగ్రతతో యోగ సంయోగమే

మరణంతో మౌనమై విశ్వంతో ఏకమై నిశ్చల ఏకాగ్రతతో యోగ సంయోగమే
నిరంతరం భువిలో ధ్యానమై మట్టిలో ఐక్యమై శూన్యస్య సంయోగ సంభోగమే
భావన సంభావన స్వభావన తత్వ పరిశోధన వైకుంఠ యోగస్య సంయోగమే
ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఆత్మ సమస్తం పరమాత్మ పర బ్రంహ యోగ సంభోగమే

6, జులై 2016, బుధవారం

నా బంధానివి నీవే నా స్నేహానివి నీవే

నా బంధానివి నీవే నా స్నేహానివి నీవే
నీవే మరణిస్తే నాతో నడిచేది ఎవరూ   || నా బంధానివి ||

నీలోనే నా శ్వాస నీతోనే నా ధ్యాస
నీ యందే నా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస

నీవు లేనిదే క్షణమైనా ఆగని శ్వాస
నీవు లేక నా ఊపిరైనా నిలువదులే

జీవంతో ఉదయించి మరణంతో వెళ్ళేదవా
ఆత్మతో జీవించి పరమాత్మతో నడిచెదవా    || నా బంధానివి ||

హితమునే తెలిపి విజ్ఞానాన్ని పంచావు
విశ్వ జ్ఞానంతోనే అనుభవాన్ని ఇచ్చావు

అరిషడ్వార్గాలనే జయించి విచక్షణనే నేర్పావు
ఇంద్రియాల నిగ్రహంతోనే గమనాన్ని గుర్తించావు

విశ్వంతో నడిపించి అనుభవాన్ని తెలిపావు
లోకంతో పలకరించి విజ్ఞానాన్ని అందించావు   || నా బంధానివి ||

5, జులై 2016, మంగళవారం

మరణంతో దుఃఖం లేదు జన్మతో సంతోషం లేదు

మరణంతో దుఃఖం లేదు జన్మతో సంతోషం లేదు
జీవించుటలో ఏది కలిగినా తాత్కాళిక సంభోగమే
అధిక సంతోషంలో అతిశయోక్తి ఎంతని చెప్పలేవు
అల్ప దుఃఖంలో అసంతృప్తి ఏమని వివరించలేవు
మనస్సులోనే విజ్ఞాన పరిశోధనతో ముందుకు సాగేవు
అనుభవమే మరణ జన్మల జీవన జీవిత భావ బంధాలు 

1, జులై 2016, శుక్రవారం

మరణంతో ఆత్మ శరీర రూపాన్ని దేహ శ్వాసను విడచినది

మరణంతో ఆత్మ శరీర రూపాన్ని దేహ శ్వాసను విడచినది
ఆత్మ విడిచిన శరీర రూపాన్ని మరల ఏనాటికీ ధరించదు
మళ్ళీ సరికొత్త శ్వాసతో మరో దేహంలో కొత్త జీవంతో ప్రవేశిస్తుంది
దేహ శరీరానికి జీవం మొదలు కావడానికే ఆత్మ ప్రవేశిస్తుంది
ఆత్మ పంచ భూతాలతో కూడిన మాతృత్వ విశ్వ ప్రకృతి శక్తి
ఆత్మ ఒక శ్వాస ఆత్మ ఒక ధ్యాస ఆత్మ ఒక స్పర్శ ఆత్మ ఒక లక్షణం  
ఆత్మ ఒక భావన ఆత్మ ఒక స్వభావం ఆత్మ ఒక తత్వం ఆత్మ ఒక గుణం

30, జూన్ 2016, గురువారం

మరణమే వైకుంఠమా మౌనమే మోక్షమా

మరణమే వైకుంఠమా మౌనమే మోక్షమా
మరణంతో స్వర్గమా మౌనంతో నవ లోకమా
మరణమే విశ్వానికి అంకితమా మౌనమే శూన్యమా
మరణంతో కైలాస క్షేత్రమా మౌనంతో అనంతమా 

29, జూన్ 2016, బుధవారం

మరణంతో నిరంతరం విశ్రాంతి కలిగినా నీ కార్యాలు ఎన్నో

మరణంతో నిరంతరం విశ్రాంతి కలిగినా నీ కార్యాలు ఎన్నో
కార్యాలు పూర్తి కాకుండానే విశ్రాంతి లోకానికి వెళ్ళిపోయావు
శ్వాసనే విడచి దేహాన్నే మరచి పంచభూతాలతో కలిసిపోయావు
రూపమే శూన్యమై ఆకారమే లేనట్లు అన్నింటిని వదిలి పోయావు
మరణం వస్తుందని తెలిసినా మరణించావని నీకు తెలియదు
ఆలోచనలో భావన ఆగిపోయినా శ్వాసలో స్వభావం అదృశ్యమే
దేహంలో దైవం శరీరంలో ఆత్మ ఉన్నా మరణంతో శూన్యమే
శ్వాసపై ధ్యాస లేకనే అనారోగ్యంతో అకాలంలో మరణిస్తున్నావు