పరమాత్మా! విశ్రాంతి సమయంలో ప్రకృతిలో శ్రమిస్తూ పర్యావరణంతో పరిశుద్ధంగా ఉద్భవిస్తున్నావా
విశ్రాంతి సమయంలో ప్రకృతి జీవంతో ఉద్భవిస్తూనే పర్యావరణంతో అభివృద్ధి చెందుతూ కాలంతో పాటు సాగిపోతుంది
విత్తనం కూడా విశ్రాంతి సమయంలోనే ప్రశాంతంగా ఉద్భవిస్తూ పరిశుద్ధంగా పర్యావరణమై చిగురిస్తూ ఎదుగుతుంది
ప్రకృతి ఉద్భవించుటలో చిగురించుటలో దివ్యమైన స్వభావ తత్వాల పరిమళంతో వికసిస్తూ పరిశుద్ధమైన పర్యావరణం చెందుతుంది
ప్రకృతి ఎన్నో రకాలుగా వివిధ స్వభావ తత్త్వాలతో ఉద్భవిస్తూ చిగురిస్తూ వికసిస్తూ పరిమళిస్తూ స్వచ్చతతో సుందరమైన ఆకార రూపాలతో పరిశుద్ధంగా పర్యావరణం చెందుతూనే ఉంటుంది
చెట్లు వృక్షాలు విత్తనాలు కాండములు వేర్లు కొమ్మలు ఆకులు కాయలు ఫలములు పుష్పాలు పత్రములు ఇలా వివిధ రకాలుగా ప్రకృతి స్వరూపంతో ఆకార రూపాలుగా వివిధ తత్త్వాలతో విశ్వమంతా ఉద్భవిస్తూనే అభివృద్ధి చెందుతూనే కాలంతో పాటు సాగుతూనే ఉంటుంది
జీవులకు ప్రాణ వాయువు నుండి మరణం వరకు ప్రతి కార్యానికి ప్రకృతి ఎన్నో రకాలుగా వివిధ పదార్థాల ప్రభావాలతో వనరులుగా ఉపయోగపడుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి