16, సెప్టెంబర్ 2026, బుధవారం

తల రాత ఐనా చేతి గీతల రేఖలైనా మనం చేసే కార్యాలతోనే జీవన విధానం సాగుతుంది

తల రాత ఐనా చేతి గీతల రేఖలైనా మనం చేసే కార్యాలతోనే జీవన విధానం సాగుతుంది 
మన జీవన విధానమే మన ఆలోచనల స్వభావమే మన విజ్ఞాన కార్యాల శ్రమ సాగుతుంది   

కార్య శ్రమ ఫలితం ఏ విధంగా ఉంటే జీవన విధానం అలాగే సాగుతుంది 
కార్య విధానం ఎలా ఉంటే విజ్ఞాన ఆలోచన విధానం అలాగే సాగుతుంది 

కార్య ఫలితాన్ని మనకు అనుకున్న విధంగా మార్చుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి 
కార్య విధానాన్ని మార్చుకుంటే కార్య ఫలితం కూడా మారుతూ అభివృద్ధి చెందవచ్చు 

కార్య ఫలితం అనుకూలంగా లేకుంటే కార్యాలను కూడా విభిన్నంగా మార్చుకోవాలి 
నూతన కార్యాలను చేయలేకపోతే శిక్షణ పొందుతూ కార్య విధానాన్ని మార్చుకోవాలి 

క్రొత్త కార్యాలను ప్రణాళిక పరంగా విజ్ఞానంతో తెలుసుకుంటూ క్రమక్రమంగా సాగించాలి 
క్రొత్త కార్యాలపై జాగ్రత్త వహిస్తూ కార్య విధానాన్ని సంపూర్ణ జ్ఞానంతో సక్రమంగా సాగించాలి 

క్రొత్త కార్యాలతోనే క్రొత్త విజ్ఞానంతోనే క్రొత్త మార్పులు ఏర్పడి అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి