15, సెప్టెంబర్ 2026, మంగళవారం

మనిషి జీవించుటలో ఓర్పు నేర్పు ఎంతో అవసరం

మనిషి జీవించుటలో ఓర్పు నేర్పు ఎంతో అవసరం 

ఓర్పు ఏకాగ్రతను పెంచుతూ నేర్పు విషయాన్ని అర్థం చేసుకుంటుంది 

ఓర్పు (గమనం) లేకున్నా నేర్పు (కార్య జ్ఞానార్థం) లేకున్నా జీవించుటలో ఏ విషయ విజ్ఞానం మేధస్సుకు తోచదు   
ఓర్పు సమయాన్ని సూచిస్తుంది నేర్పు శ్రమను సూచిస్తుంది రెండు ఒకే కాలంలో పని చేస్తే కార్య పరమార్థం తెలుస్తుంది 

శ్రద్ధ (ఆసక్తి) ఉన్నప్పుడే ఓర్పు నేర్పు ఏకమౌతాయి కార్య జ్ఞానాన్ని తెలుసుకుంటాయి గమనంతో అవగాహన చేసుకుంటూ కార్య అర్థాన్ని సారాంశాన్ని పరమార్థాన్ని గ్రహిస్తాయి 

ఏకాగ్రత పరిశోధనలోనే కార్యాచరణ కారణ శాస్త్ర సిద్ధాంతాలు అద్భుతంగా ఆశ్చర్యంగా పరిపూర్ణంగా తెలుస్తాయి 

కార్యార్థం తెలిసినప్పుడేఏ కార్యమైనా విజ్ఞాన సాధనతో పరిశుద్ధంగా ఆరోగ్యంగా సామర్థ్యంగా సమయోచితంగా సాగుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion