24, సెప్టెంబర్ 2026, గురువారం

నీ శరీరం ఎలా ఉందో బ్రంహాండం కూడా అలాగే ఉన్నది

నీ శరీరం ఎలా ఉందో బ్రంహాండం కూడా అలాగే ఉన్నది 
నీ కార్యములు ఎలా ఉన్నాయో (సాగుతున్నాయో) బ్రంహాండంలో కూడా కార్యాలు అలాగే ఉన్నాయి (సాగుతున్నాయి)

నీ మేధస్సు ఎలా ఉందో బ్రంహాండం అలాగే ఉండదు 
బ్రంహాండంలో సాగే కార్యములు నీ మేధస్సులో చాలా వరకు ఉండవు తెలియవు గ్రహించలేవు ఆలోచించే సమయాన్ని పొందలేవు తెలుసుకోలేవు 

నీలో ఉన్న విజ్ఞానం శూన్యం కావచ్చు కానీ బ్రంహాండంలో ఉన్న విజ్ఞానం ఎల్లప్పుడూ పరిశోధనలతో కాల సమయంతో అణువు పరమాణువులతో వివిధ స్వభావ తత్త్వాలతో ఆకార రూపాలతో కార్యక్రమాలుగా సాగిపోతూనే ఉంటాయి 

నీ సామర్థ్యంతో నీవు జీవించగలవు అలాగే బ్రంహాండం తన సామర్థ్యంతో పరిభ్రమిస్తూ ఉంటుంది 
నీ విజ్ఞాన అజ్ఞానములతో బ్రంహాండాన్ని భంగపరచవద్దు
(యుద్ధములతో ప్రశాంతతను లేకుండా చేయవద్దు - బ్రంహాండం భయంతో భ్రమతో అదిరిపోతోంది)
(ప్రకృతిని అనేక రకాల పదార్థాలతో వస్తువులతో వ్యర్థం చేస్తూ దుర్గంధం కాలుష్యం అశుద్ధత చేయవద్దు)

బ్రంహాండమంతయు అనారోగ్యమైతే అణువువైనను పరిశుద్ధం లేక జీవ కణం లేక దుర్గంధమై వినాశనమవుతుంది 
మానవ మేధస్సుకు మానవ జన్మకు (మానవ అవతారానికి) మానవ విజ్ఞానానికి విలువ లేకుండా పోతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి