ప్రదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రదం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఆగస్టు 2017, బుధవారం

లక్ష్మి ప్రదం సర్వ సిద్ధం

లక్ష్మి ప్రదం సర్వ సిద్ధం
లక్ష్మి కాంతం పూర్ణ తేజం
లక్ష్మి భావం వేద వచనం
లక్ష్మి కనకం దివ్య పూజ్యం
లక్ష్మి రూపం శుభ ప్రభావం
లక్ష్మి కార్యం మహా కాంచనం
లక్ష్మి తత్వం సర్వ మంగళం
లక్ష్మి కాటాక్షం విశ్వ మోక్షనం 

10, నవంబర్ 2016, గురువారం

నాట్యం భరత నాట్యం ఆంధ్రుల నటరాజుని కళా నాట్యం

నాట్యం భరత నాట్యం ఆంధ్రుల నటరాజుని కళా నాట్యం
గీతం సంగీతం సరిగమల శుభ గాన స్వర జీవ కళా నాట్యం

వేదం మన వేదం ఆంధ్రుల వేదాంత విజ్ఞాన పాండిత్యం
భావం మన భావం మాతృత్వ మహాత్ముల విశ్వ భావత్వం  || నాట్యం ||

స్వర గాన సంగీత సరిగమల పరిచయమే పదనిసల పరిమళం
నవ గాన నటరాజ భావాలే నాట్య కళా చాతుర్య భరత చరితం

భారతీయుల భారత నాట్యం జగతికి జీవ పోషణ కళా భావం
వేద భావ రూప తత్వం నాట్య కళా భారత సంస్కృతి ప్రదం  || నాట్యం ||

విశ్వ భావాల గీతామృతం స్వర గాన సంగీత స్వరాభిషేకం
నవ భావాల నాట్యామృతం నటరాజుని శృంగార నైవేద్యం

ఆత్మ కళా జ్యోతి రూపం పరమాత్మ తత్వ నాట్య శిఖరం
మాతృ కళా భరితం నాట్య సాగర సంగీత స్వర ఖండం  || నాట్యం ||