ఒక ఇల్లు గడవాలంటే ఇంటి యజమానిగా ఎంతో శ్రమించి సంపాదిస్తూ అనారోగ్యం చెందుతూ ఓడిపోతుంటాడు
బ్రంహాండమంతా గడవాలంటే ప్రకృతిగా ఎంతో శ్రమిస్తూ ఉద్భవిస్తూ అవతరిస్తూ పరిశుద్ధమవుతూ పంచభూతాలతో ఋతువుల ప్రభావాలతో జీవిస్తూ సాగుతున్నది ఎంతో ఖర్చుతో సృష్టి సాగిపోతున్నది
బ్రంహాండంలో ఉన్నవన్నీ మనకు తరతరాలుగా సాగాలంటే ఎన్నో విధాల ఆరోగ్యంగా సామర్థ్యంగా పరిశుద్ధంగా అణువణువునా ఉద్భవిస్తూనే ఉపయోగపడుతూనే నాణ్యతగా ఎంతో కాలం శ్రద్ధతో సహనంతో సాగుతూ ఉండాలి
బ్రంహాండం సామర్థ్యంతో తరతరాలుగా యుగయుగాలుగా జీవించాలంటే పంచభూతాల [నిత్యం గాలి నీరు భూ ప్రదేశం (భూమి ఆకాశం) అగ్ని (సూర్యుని వెలుతురు)] శ్రమ ఖర్చు కాల సమయం ఎంతో ఎవరికైనా తెలుస్తుందా
ఒక క్షణానికి ఎంతో శ్రమ సామర్థ్యం ఎంతో శ్రద్ధ కాల సమయ ఖర్చు ఎన్నో విధాలా ఉంటుంది
ప్రపంచమంతా వెలిగే మన విద్యుత్తు ఖర్చు కంటే సూర్య శక్తి ఎన్నో ఎక్కువ రెట్లుగా ఎన్నో రెట్ల కాంతి ఖర్చవుతుంది
పంచభూతాలుగా నిత్యం గాలి నీరు భూ ప్రదేశం (భూమి ఆకాశం) అగ్ని (వెలుతురు) కాలం జీవులకు ఆసరగా ఎల్లప్పుడు ఆరోగ్యంగా జీవించుటకు ఉపయోగపడుతూనే తరతరాలుగా ఉంటున్నాయి
బ్రంహాండం గడవాలంటే ఎంతో పరిశుద్ధమైన నీరు సకల జీవరాసులకు ప్రకృతికి ఎన్నో విధాల నిత్య అవసరం
నీరు మేఘాలుగా ఏర్పడుతూ ఋతువుల ఆధారంగా వర్షంగా మారుతూ పరిశుద్ధమైన నీరుగా భూ మండల ప్రదేశమంతా చెరువులు వాగులు సరస్సులు నదులు సముద్రాలలో ప్రవహిస్తూ నిధిగా నిలువ అవుతూ ఉంటాయి
బ్రంహాండం గడవాలంటే ఎంతో పరిశుద్ధమైన గాలి సకల జీవరాసులకు ప్రకృతికి ఎన్నో విధాల నిత్య అవసరం
పుష్పాల సుగంధ పరిమళాలతో జీవులకు ఉత్తేజమైన స్వభావాలతో ప్రాణవాయువుగా ఉపయోగపడుతుంది
వ్యర్థముల దుర్వాసనాలను గాలితో అటూఇటూ వీస్తూ మరొక చోటుకు తరలిస్తూ తగ్గిస్తూ ప్రయత్నిస్తూ ఉంటుంది
ప్రకృతి పర్యావరణమైన పత్రహరితమైన స్వచ్ఛమైన పరిశుద్ధమైన గాలి సకల జీవులకు సామర్థ్యమైనా ప్రాణవాయువుగా జీవ శ్వాసకు ఆరోగ్యాన్ని ఇస్తుంది దేహాన్ని శ్రమించుటకు జీవించుటకు ఉత్తేజం చేస్తుంది
బ్రంహాండం గడవాలంటే ఎంతో ప్రధానమైన భూ ప్రదేశం జీవరాసులు నిలువడాని జీవించడాని విశ్రాంతికి నిత్య అవసరం
ఎన్నో నిర్మాణాలను ఎన్నో త్రవ్వకాలను ఎన్నో మహా రూపాలను భవనాలను భూ ప్రదేశ సామర్థ్యం ఆధారంగానే సాగిస్తున్నాము సౌకర్యాలతో జీవిస్తున్నాము అందులోనే నీటి నిల్వలు ప్రవాహాలు ప్రకృతి అడవులు గిరులు పర్వతాలు శిఖరాలు హిమాలయాలు విలువైనవిగా ఉపయోగకరంగా కొలువై ఉన్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!