11, నవంబర్ 2026, బుధవారం

ఉన్నదంతా దేవాలయాలకు ఇచ్చేస్తూ వెళ్ళిపోతే దేహాలయానికి మిగిలేది ఏమి

ఉన్నదంతా దేవాలయాలకు ఇచ్చేస్తూ వెళ్ళిపోతే దేహాలయానికి మిగిలేది ఏమి 
దేహాలయం జీవిస్తేనే కదా దేవాలయాలను చూసుకునేందుకు వీలుగా ఉంటుంది 

దేహంతోనే కదా జీవం జీవిస్తూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ వివిధ కార్యాల శ్రమతో సాగిపోతుంది 

దేహం శక్తి సామర్థ్యాలతో జీవిస్తేనే తరతరాలకు కావలసిన వాటిని సమకూర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సాగిపోతుంది 

దేవాలయం ఎందరికో గొప్పదైనా దేహాలయం ఎవరికీ వారికే ఎంతో గొప్పది ప్రధానమైన జీవంతో కూడినది 

దేహాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ దేవాలయంతో జీవిస్తూ జీవితాన్ని జీవన విధానాన్ని సాగించాలి  

దేహాలయాన్ని ఆరోగ్యంతో చూసుకుంటూ మేధస్సును అపారమైన విశ్వ విజ్ఞానంతో సాగిస్తూ ఐశ్వర్యంగా పరమార్థంగా పరమాత్మంగా పరిశుద్ధంగా పర్యావరణంగా జీవన విధానాన్ని అనుబంధంతో అభివృద్ధి చేసుకోవాలి 

దేహం ఆరోగ్యంగా ఉంటేనే దేవాలయాన్ని పరిశుద్ధంగా చేసుకుంటూ పవిత్రంగా ఉంచుకోవచ్చు తరతరాలుగా సాగించవచ్చు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion