గంధం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గంధం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, డిసెంబర్ 2016, మంగళవారం

హృదయం మధురం కిరణం అరుణం

హృదయం మధురం కిరణం అరుణం
సమయం తరుణం తపనం చరితం
ప్రేమం ప్రాణం ప్రియం నేస్తం
మౌనం భావం మోహం వేదం
గానం గీతం రాగం గాత్రం                         || హృదయం ||

యుగమే తరమై లయమే లీనమై పోయేనా
నిత్యం సత్యం అనుకున్నా ధర్మం దైవం తలచేనా
దేహం జీవం ఒకటైనా శరీరం ఆకారం ఒకటైపోవునా

సంగీతం సంతోషం ఆనందం అదృష్టం వరించేనా
రూపం భావం దేహం జీవం ఒకటిగా కలిసిపోయేనా   || హృదయం ||

తేజం వర్ణం పత్రం గంధం సుందరమై మెరిసిపోయేనా
స్వరమే వరమై నేత్రమే చిత్రమై కనిపించి వినిపించేనా
మార్గం గమ్యం కాలం క్షణమై కరిగిపోతూ ప్రయాణించేనా

మేఘం వర్షం కదిలిపోయి తరిగిపోతూ ప్రవహించేనా
బంధం భాష్పం ముడిపడిపోయి సంబంధమయ్యేనా  || హృదయం || 

15, జూన్ 2016, బుధవారం

ఏక దంతం జ్ఞాన దంతం విశ్వ విజ్ఞేశ్వర
సూర్య కిరణం చంద్ర కాంతం సరస్వతి
మేఘ వర్ణం ఆకాశ రూపం శ్రీ లక్ష్మీ దేవి
ప్రకృతి గంధం సృష్టి స్వరూపం సంతోషి మాత