16, జులై 2026, గురువారం

జీవించుటలో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో చేసే కార్యానికే తెలిసేనా

జీవించుటలో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో చేసే కార్యానికే తెలిసేనా 
గమనంతో చేసే కార్యం విజ్ఞానంతో సాగిపోతున్నా చివరికి ప్రతిఫలం ఎవరికో 

శ్రమించుటలో సహనం ఆరోగ్యం కోల్పోయినా ప్రతిఫలాన్ని పొందలేకపోతే జీవించుట ఎంతటి అభాగ్యమో 

ఒకరి శ్రమలో ఒకరే జీవించలేరుగా కుటుంబమంతా తనపైననే ఆధారపడుతూ ఆహారం ఆరోగ్యంకై ఎదురు చూస్తూనే ఉంటారుగా తనతో పాటు తన కుటుంబం కూడా అభివృద్ధి చేసుకొనుటకు శ్రమను ఫలితం చేసుకోవడమే ప్రధాన మార్గమే కదా ఫలితమే శూన్యమైతే ప్రతి ప్రశ్నకు నిరాశగా ఉత్తరం ఎలా తెలుపగలమా 

శ్రమకు ఆదాయం లేకున్నా శ్రమించుటకు సహనాన్ని అందించిన దేహానికి ఆహారమైనను అందించకపోతే శరీరం ఆరోగ్యంతో నిలిచిపోవునా కుటుంబంతో సాగిపోవునా మళ్ళీ శ్రమించే సామర్థ్యం ఎలా సహనమై కలుగుతుందో శ్వాసకైనా ప్రయాస ప్రశాంతంగా సాగిపోవునా 

శ్రమను ఇచ్చే యాజమాన్యం తగిన ఫలితాన్ని ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయదో తమ మేధస్సుకు తెలియాలి 
తమ జీవితాలకు అర్థం కావాలి తమ కుటుంబమే పరమార్థాన్ని శ్రద్ధగా సమన్వయంతో ప్రశాంతంగా గ్రహించాలి 

ప్రతిఫలం ఆదాయం కాదు ఓ కుటంబం జీవించే మార్గం తరతరాలుగా అభివృద్ధి చెందే జీవితాల అనుబంధాల ప్రయాణం 


-- వివరణ ఇంకా ఉన్నది!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి