క్షణాలు క్షణాలతో తరలిపోతున్నాయి నిమిషాలు నిమిషాలతో వెళ్ళిపోతున్నాయి
గంటలు గడియాలుగా గడిచిపోతున్నాయి రోజులు రోజులుగా మారిపోతున్నాయి
వారాలు నెలలు సంవత్సరాలు కాలంతో తరతరాలుగా యుగయుగాలుగా సాగిపోతూనే ఉన్నాయి
క్షణంతో నీవు నిలిచిపోవాలంటే లేదా ఆగిపోవాలంటే కార్యాన్ని ఓ క్షణాన ప్రారంభించి నిమిషాలతో శ్రమిస్తూ గంటలుగా సాగిపోవుటలో కలిగే ఫలితమే క్షణం యొక్క గొప్పతనం
ఆ క్షణమే ఆ కార్యమే నిన్ను విజ్ఞానంతో సాధనను సాగిస్తూ శ్రమను పరిశోధనగా మార్చుతూ అభివృద్ధి చేస్తూ మహా గొప్ప విజయాన్ని కలిగిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment