ప్రకృతిలో లభించే పదార్థాలలో ఏవైనా శరీరానికి అనారోగ్యమైతే ప్రకృతికే వదిలిపెట్టండి
అనారోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించుకుంటే శరీరం అలవాట్లతో వ్యసనపడిపోతుంది
అనారోగ్య పదార్థాలను అలవాటు చేసుకుంటే శరీర భాగాలు విపరీతంగా చెడిపోయి మేధస్సులో పరిశుద్ధమైన ఆలోచనల విచక్షణాల కణాలు అంతరించిపోతాయి శ్రమించుటలో శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తూ శూన్యం చేస్తాయి
ప్రకృతి పదార్థాలను పరిశోధన చేయడం మానవ విచక్షణ మేధస్సుకు మహా లక్షణం
పరిశోధనలో ప్రకృతి పదార్థాలు శరీరానికి అనారోగ్యాన్ని కలిగిస్తాయని గమనించుటలో వాటిని వాడుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానం
అనారోగ్య పదార్థాలను జీవన విధానంలో వాడకుండ కట్టుబడి ఉండడం తరతరాలకు అత్యంత అవసరం మహోదయమైన శాస్త్రీయ ఆచరణ సిద్ధాంతం జీవన విధాన వ్యవస్థానం ఆరోగ్య అభివృద్ధికి ప్రధాన లక్షణమైన సారాంశం సమాజ శ్రేయస్సుకు నిదర్శనం మానవులకు మార్గదర్శక సూత్రం
అనారోగ్యమైన పదార్థాల వలన కుటుంబంతో పాటు సమాజం లోకం ప్రపంచం అంతయును అశుద్ధమవుతూ కాలుష్యమై జీవిత ఆయుస్సు తగ్గిపోతుంది అనారోగ్య సమస్యలు వంశ పారంపర్యముగా సంభవిస్తూనే ఉంటాయి
అలవాట్లతో పరిశుద్ధమైన గృహం వీధి గ్రామమ పట్టణం నగరం సమాజం ప్రపంచం ప్రదేశం లేకుండా పోతుంది
అనారోగ్యానికి వైద్యం ఔషధం కొంత వరకు ఉందేమో గాని అలవాటును వదిలించు కోవటానికి వైద్యం ఔషధం లేదు
మేధస్సులోని ఆలోచన వ్యవస్థను మార్చుకుంటేనే అలవాటును మానుకోవడానికి వీలు కలుగుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion