గడియారం ప్రస్తుత సమయాన్ని తెలుపుతుందే గాని గత కాలాన్ని సూచించదు
ఈ రోజు జరుగుతున్న సమయాన్ని క్షణాలుగా నిమిషాలుగా గంటలుగా సూచించగలదు
నేటి వరకు ఎంత సమయమైనదో విశ్వ కాలం ఎంతో ఏ గడియారం సూచించదు
గడియారం దిన చర్య కార్యాలకు సమయాన్ని సూచిస్తూ ఆ రోజుకు బాగా ఉపయోగపడుతుంది
పంచాంగ పుస్తకమైనా తారీకుల పట్టి ఐనా జరిగిన కొంత కాలాన్ని సంవత్సరాలుగా సూచిస్తుందే గాని విశ్వ కాలాన్ని లెక్కించదు
మానవ మేధస్సు అవగాహనతో విజ్ఞాన అనుభవంతో కొన్ని యుగాలుగా గడిచిందని విశ్వ కాలాన్ని ఇంచుమించుగా తెలుపగలము (ఖచ్చితంగా ఎవరు తెలుపలేరు ఎవరు గ్రహించలేరు ఎవరు లెక్కించలేరు ఎవరు గుర్తించలేరు)
శూన్యం నుండి శూన్య కాలం మొదటి క్షణం నుండి నేడు అవతరించిన బ్రంహాండమంతా సాగుతున్న కాలాన్ని ఇప్పటి వరకు గడిచిన విశ్వ కాల సమయంగా ఎవరు ఎంతని చెప్పలేరు ఏ గడియారం సూచించదు
మానవుడు అవతరించి తన విజ్ఞానంతో కొంత కాలానికి అనుభవ పూర్వకంగా గడియాన్ని (దినసరి సమయ యంత్రం) పంచాంగాన్ని తారీఖుల పట్టిని తయారు చేసుకున్నాడు కొంత వరకు కాలాన్ని గతం వైపుగా భవిష్య వైపుగా కొన్ని కార్యాలకు అవసరాలకు కారణాలకు విచారణలకు పరిష్కామములకు లెక్కించగలడు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి