20, జులై 2026, సోమవారం

సూర్యోదయాన ఉదయించే దివ్య తేజమా కాంతి స్వరూపమై దేహంలో ఉద్భవించవా

సూర్యోదయాన ప్రజ్వలంతో పరిశుద్ధమైన సూర్య కాంతి తేజస్సుతో ఉద్భవించే ప్రకాశవంతమైన జ్యోతి స్వరూపాన్ని దేహంలో ఆత్మ పరరూపంతో  వెలిగించవా  

దేహంతో పాటు మేధస్సును కూడా ప్రజ్వలం చేస్తూ జ్యోతి స్వరూపాన్ని పరంజ్యోతిగా శరీరమంతటా నిత్యం పరిశుద్ధ తత్త్వంతో దివ్యమైన ప్రజ్ఞానంతో వెలిగించవా 

పర్వతాల నుండి సాగర జల పొరలపై నుండి పరిశుద్ధమవుతూ వృక్షారణ్య పర్యావరణంతో విశ్వమంతా విజ్ఞాన కార్య స్వరూపమై అఖండమైన వర్ణనాతీతమైన వెలుగులతో ఉద్భవించవా 


-- వివరణ ఇంకా ఉన్నది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి