సూర్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సూర్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2017, సోమవారం

ఓం నమో శ్రీ సూర్య విజ్ఞేశ్వరాయ నమః

ఓం నమో శ్రీ సూర్య విజ్ఞేశ్వరాయ నమః
ఓం నమో శ్రీ చంద్ర విద్యేశ్వరాయ నమః
ఓం నమో శ్రీ శుభ సంకల్ప సర్వాయ నమః
ఓం నమో శ్రీ వేదాంత సిద్ధేశ్వరాయ నమః
ఓం నమో శ్రీ మంగళ దేవ కటాక్షాయ నమః 

31, ఆగస్టు 2017, గురువారం

విశ్వ దంతాయ నమః

విశ్వ దంతాయ నమః
వేద విజ్ఞానాయ నమః

సర్వ లోకాయ నమః
భావ తత్వయ నమః

పూర్ణ చంద్రాయ నమః
సూర్య కాంతాయ నమః

సత్య ధర్మాయ నమః
నిత్య దైవాయ నమః

దివ్య రూపాయ నమః
విద్య నాదాయ నమః

జగతి పూజ్యంతాయా నమః
జనని మాతృత్వాయ నమః

ఆత్మ పరమాత్మాయ నమః
రామ పరంధామాయ నమః

శ్రీరస్తు శుభమస్తాయ నమః
శ్రీధరణి కళ్యాణాయ నమః 

23, ఆగస్టు 2017, బుధవారం

ఉదయిస్తూనే ప్రయాణిస్తున్నావా సూర్యదేవా

ఉదయిస్తూనే ప్రయాణిస్తున్నావా సూర్యదేవా
గమనిస్తూనే ఉదయిస్తున్నావా సూర్య తేజా
స్మరిస్తూనే ప్రకాశిస్తున్నావా సూర్యభావా

ప్రజ్వలంతో ప్రతేజమై ప్రకాశిస్తూ ఉదయిస్తూనే ప్రయాణిస్తున్నావా  || ఉదయిస్తూనే ||

ధర్మమే నీదని సత్యమే నీవని నిత్యం జీవిస్తున్నావా
భావమే నీదని తత్వమే నీవని సర్వం స్మరిస్తున్నావా
వేదమే నీదని జ్ఞానమే నీవని శాశ్వితం ధ్యానిస్తున్నావా
దైవమె నీదని దేహమే నీవని సమస్తం గమనిస్తున్నావా   || ఉదయిస్తూనే ||

జీవమై ఉన్నావో ధ్యాసతో ఉన్నావో ధర్మమే తెలిపేనా
వర్ణమై ఉన్నావో రూపంతో ఉన్నావో సత్యమే తెలిపేనా
భావమై ఉన్నావో తత్వంతో ఉన్నావో వేదమే తెలిపేనా
దైవమై ఉన్నావో దేహంతో ఉన్నావో జ్ఞానమే తెలిపేనా    || ఉదయిస్తూనే || 

8, మార్చి 2017, బుధవారం

ఓం నమో సూర్య దేవా ... ఓం నమో సూర్య కాంతా ...

ఓం నమో సూర్య దేవా ... ఓం నమో సూర్య కాంతా ...
సువర్ణముచే ఉదయించెదవా సుగుణముచే విస్తరించెదవా
నీ సువర్ణ సుగుణాలచే విశ్వాన్ని తేజస్సులతో ఆవరించెదవా  || ఓం నమో ||

నీలోని ప్రతి కిరణం మేధస్సులకు ప్రజ్వలమైన పరిశోధనమే
నీలోని ప్రతి తేజం ఎన్నో కార్యాలకు మహత్యమైన ప్రయోగమే

నీలోని ప్రతి వర్ణం ఆలోచనలకు మహోజ్వల పర్యావరణమే
నీలోని ప్రతి భావం జీవరాసులకు మహోదయ ప్రభంజనమే                  

నీలోని ప్రతి గుణం ఎన్నో జీవితాలకు మహనీయమైన ప్రబోధమే            
నీలోని ప్రతి తత్వం ఎందరో మహానుభావులకు మహా ప్రఘారమే    || ఓం నమో ||        

నీలోని ప్రతి వేదం ఎందరో మహాత్ములకు మహా ప్రచ్ఛనమే                  
నీలోని ప్రతి స్పర్శనం ఎన్నో అణువులకు మహా ప్రభావమే

నీలోని ప్రతి కణం ఎన్నో గ్రహాలకు దిక్సూచితమైన ప్రదర్శనమే
నీలోని ప్రతి చలనం ఎన్నో లోకాలకు సుదర్శనమైన ప్రకాశమే

నీలోని ప్రతి రూపం భావ స్వభావాలకు అత్యంతమైన ప్రక్షాళనమే
నీలోని ప్రతి ఆకారం వేద తత్వాలకు ఉన్నతమైన ప్రతిబింబమే    || ఓం నమో || 

6, మార్చి 2017, సోమవారం

లోకానికే మహోదయ తేజమై ఉదయిస్తున్నావా సూర్య దేవా

లోకానికే మహోదయ తేజమై ఉదయిస్తున్నావా సూర్య దేవా
మేధస్సుకే విజ్ఞాన ఉత్తేజమై ప్రజ్వలిస్తున్నావా సూర్య భావా  || లోకానికే ||

నీ తేజము లేని జగతి విజ్ఞానము లేని నిర్మాణమై అమానుషమయ్యేను
నీ కిరణము లేని లోకము ఉత్తేజము లేని మేధస్సై అంధకారమయ్యేను

నీ తేజోదయంతోనే జీవ ప్రకృతి పర్యావరణంతో శోభిల్లమయ్యేను
నీ వర్ణోదయంతోనే జీవరాసుల జీవన విధానము శోభనమయ్యేను   || లోకానికే ||    

నీ సూర్య తేజము లేక విశ్వ లోకమంతా అంధకార చీకటి ప్రయాసతో సతమతమయ్యేను
నీ సూర్య కిరణము లేక మేధస్సు సామర్థ్యమంతా అజ్ఞాన ప్రయాసతో నిరుపయోగమయ్యేను

నీవు లేని కార్యం ఉత్తేజం లేని ఆలోచనల పరిశోధనకే పరిమితం
నీవు లేని భావం వేదత్వం లేని స్వభావాల పర్యవేక్షణకే అంకితం   || లోకానికే ||   

9, డిసెంబర్ 2016, శుక్రవారం

ఓ సూర్య దేవా! నీ కిరణం లేక విశ్వానికి వెలుగు భావన లేదే

ఓ సూర్య దేవా! నీ కిరణం లేక విశ్వానికి వెలుగు భావన లేదే
ఓ సూర్య దేవా! నీ తేజము లేక జగతికి మెలకువ భావన రాదే  || ఓ సూర్య దేవా! ||

ప్రజ్వలమై ప్రసరించే నీ కిరణాల తేజములు లోకానికే వెలుగులు
ప్రకాశమై ఉద్భవించే ఆకాశ మేఘాల వర్ణాలే లోకానికి ఉత్తేజములు

చూపేలేని జీవులకు ఉత్తేజాన్ని కలిగించే మర్మ లోక భావన నీ చలన కార్యమే
చలనమే లేని వృద్దులకు శ్వాసను సాగించే కాల స్వభావన నీ ధ్యాన గమనమే  || ఓ సూర్య దేవా! ||

సువర్ణమువలే ప్రకాశించే నీ కిరణాల కాంతులు నేత్ర విజ్ఞాన మేధస్సులో మెలకువలు
అసంఖ్యాక వర్ణములచే ప్రజ్వలించే నీ రూప భావాలు ఉత్తేజ ప్రేరణల కార్య కలాపాలు

విశ్వమై వెలిగే నీ రూపం దేశమై ఉదయించి విదేశమై అస్తమించేను
జగమై జ్వలించే నీ దేహ భావం కాలంతో ప్రయాణమై ప్రజ్వలించేను  || ఓ సూర్య దేవా! ||

18, జులై 2016, సోమవారం

సూర్యనితో జీవించే కాలం నా మేధస్సులో మొదలైనది

సూర్యనితో జీవించే కాలం నా మేధస్సులో మొదలైనది
సూర్యునితో నడిచే కాలం నా ఆలోచనలో ఆరంభమైనది
సూర్యునితోనే జీవిస్తూ సాగే కాలం నాలోనే ఉదయించినది  || సూర్యనితో ||

సూర్యోదయమే నాకు తెలిపెను నాతో మేల్కొని నడచిరా అని
సూర్య కిరణమే నాకు తెలిపెను నాతో మెలకువగా సాగరా అని

సూర్య తేజస్సుతో వర్ణములయందు సాగగా నాలో సువర్ణ భావమే
సూర్య ప్రజ్వలంతో కాంతి కిరణాలయందు సాగగా నాలో ప్రకాశమే

సూర్య క్రాంతి భ్రమణమే గ్రహాల స్థితి కాల ప్రయాణమని
సూర్య భ్రమణ కిరణమే విశ్వ ప్రదేశాల సకాల గమనమని   || సూర్యనితో ||

సూర్యునితో నా దేహం కాంతి కిరణమై జగతికే ప్రకాశమైనది
సూర్యునిలో నా శ్వాస క్రాంతి జీవమై విశ్వానికే సువర్ణమైనది

సూర్యుని లోకమే నవ ఉత్తేజమైన విశ్వ జీవన లోకమని
సూర్యని వర్ణమే నవ తేజమైన కాంతి జీవన ప్రపంచమని

యుగాలుగా సాగే కాలంలో ప్రతి క్షణం నేను ఒక భావమై సాగుతున్నాను
క్షణాలుగా సాగే సమయంలో ప్రతి స్థానంలో ఒక వర్ణమై వెలుగుతున్నాను  || సూర్యనితో ||

15, జూన్ 2016, బుధవారం

ఏక దంతం జ్ఞాన దంతం విశ్వ విజ్ఞేశ్వర
సూర్య కిరణం చంద్ర కాంతం సరస్వతి
మేఘ వర్ణం ఆకాశ రూపం శ్రీ లక్ష్మీ దేవి
ప్రకృతి గంధం సృష్టి స్వరూపం సంతోషి మాత 

13, జూన్ 2016, సోమవారం

ఉదయించేను సూర్య కిరణం జ్వలించేను అరుణ కిరణం

ఉదయించేను సూర్య కిరణం జ్వలించేను అరుణ కిరణం
మనస్సులో స్వయంవరం వయస్సులో కలిగే స్వరంవరం
జీవితమే సుమధురం జీవనమే సుగంధాల సముద్ర తీరం  || ఉదయించేను ||

ఉదయించే భావాలతో మొదలయ్యేను నాలో ఆలోచనల తీరం
కిరణాల తేజస్సులతో నాలో కలిగేను భావాల వేద వర్ణ విజ్ఞానం

యదలో ప్రజ్వలించే వర్ణ తేజ భావం సముద్రాన్ని తాకే రూప వర్ణం
మేఘంతో సాగే ఆలోచన కిరణాల అంచులతో కలిసే సంధ్యావనం

ప్రకృతిలో జీవించే జీవితం వయసులో కలిగే మొహం ఓ వందనం
అడుగులు కలిసే లోకం మనస్సులో సాగే భావం ఓ స్వయంవరం  || ఉదయించేను ||

స్వరాలతో సాగే సంభాషణలో ఉన్నది ఓ విశేషం అది అర్థానికే మహా నిర్వచనం
సుగంధాలతో సాగే వేదనలో ఉన్నది ఓ ప్రత్యేకం అది పరమార్థానికే అనుబంధం

విశ్వ వేదం మేఘ వర్ణం జగతిలో నిలిచే తరుణం మనలో కలిగే సమయ భావం
వర్ణ కిరణం తేజో భావం సృష్టిలో కలిగే వచనం వయసులో మొదలే లోక జ్ఞానం

ఎన్నో భావాల జీవితాలు సాగేను సముద్ర తీరాల మేఘ వర్ణాల రూపాలలో
ఎన్నో ఆశలు మొదలయ్యేను స్వప్న భావాల అలలతో సంధ్యా సమయంలో  || ఉదయించేను ||

4, మే 2016, బుధవారం

ఉదయించిన సూర్యోదయమే మేధస్సులో ఆలోచన తేజము

ఉదయించిన సూర్యోదయమే మేధస్సులో ఆలోచన తేజము
ఆలోచన భావమే ఆలయ శిఖరపు అమర శిల్పకల గాత్రము
సూర్య తేజో భావమే విజ్ఞాన కార్య త్రిపుర త్రికరణ సౌలభ్యము
విశ్వ తేజమే సూర్య పరి పూర్ణ ఉజ్వల భవిష్య దేహ ధామము