7, సెప్టెంబర్ 2026, సోమవారం

ఐశ్వర్యంతో జీవించ లేవు సంపాదనతోనే జీవించగలవు

ఐశ్వర్యంతో జీవించ లేవు సంపాదనతోనే జీవించగలవు 
ఐశ్వర్యం ఆస్తులతో ఉన్నందు వలన దానిని అమ్ముకోలేవు 

ఆస్తులను ఎప్పుడంటే అప్పుడు ఆలోచించకుండా అమ్ముకున్నా జీవిత కాలమంతా సరిపడదు ప్రయోజనం ఉండదు  

సంపాదన ప్రతి నెల వస్తున్నందు వలన ఖర్చులతో రోజు వారి అవసరాలతో జీవించగలవు 
సంపాదనతోనే అవసరాలు తీరిపోతూ పొదుపులతో విజ్ఞానం చెందుతూ అభివృద్ధి చెందగలవు 

పొదుపు లేని ఖర్చులు అనవసరమైతే అజ్ఞానంతో జీవించెదవు 
సంపాదన లేని అప్పులు అవసరానికైనా అజ్ఞానంతో జీవించెదవు 

విజ్ఞానంతో ఆలోచిస్తూ ఆరోగ్యంతో శ్రమిస్తూ తల్లితండ్రులు పోషిస్తున్నప్పుడే సంపాదన చేయడం ప్రారంభించాలి 

ఏ బంధంతో జీవన విధానం ఎలా సాగిపోతుందో తెలియక తోచక ముందే సంపానతో బంధాన్ని ప్రారంభించాలి 

విజ్ఞానంతో ఆరోగ్యంతో శ్రమిస్తూ జాగ్రత్తగా సంపాదనతో ఆలోచిస్తూ ఏ కార్యాలతో నష్టం లేకుండా జీవితాన్ని సాగించు శుభం వర్ధిల్లుతూ ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి