28, సెప్టెంబర్ 2026, సోమవారం

సూర్యదేవా! ఉదయించుటలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలను జీవుల శరీరానికి అందించవా

సూర్యదేవా! ఉదయించుటలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలను జీవుల శరీరానికి అందించవా  
శ్రమించుటలో శరీర భాగాలకు అవయవాలకు దృఢమైన సహనం సామర్థ్యం లేకుండా పోతున్నది 

శ్రమించుటలో శరీర భాగాలు వంగిపోతున్నాయి అవయవాలు అవస్థలతో క్షీణిస్తూ పోతున్నాయి 
మేధస్సుకు ఉత్తేజవంతమైన ఆలోచనలు లేకుండా మనస్సుకు ప్రశాంతత లేకుండా పోతున్నాయి 

శ్రమకు తగ్గ ఫలితం లేక విరామ విశ్రాంతి లేక ఇంకా శ్రమిస్తూ శరీరాన్ని అనారోగ్యతో సాగిస్తున్నాయి 
మానవ జీవన విధానం సంపాదనతోనే ఐశ్వర్యంతోనే దేనినైనా సమకూర్చుకునేలా శ్రమిస్తున్నారు 

సరైన ఆహారం లేదు సరైన విశ్రాంతి లేదు సరైన నిద్ర సమయం లేదు సరైన కార్యజ్ఞానం కార్యక్రమ కార్యాచరణ లేదు 

సూర్యదేవా! మీ సూర్యోదయ సమయ ప్రజ్వల కాంతి ప్రకాశ స్వరూప సువర్ణాల కిరణాలతో పర్యావరణ పరిశుద్ధ  ఔషధంతో సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతిరోజూ జీవుల శరీరాలకు అందించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి