అణువులో బంధం ఉన్నది పరమాణువులో పరస్పరం స్పర్శించే ప్రకృతి సంబంధం ఉన్నది
అణువు పరమాణువుల బాంధవ్యముతో ఉద్భవించే స్వరూపములు మిళితమై ఉన్నాయి
అణువు పరమాణువుగా ఆకారములు ఉన్నా మహా రూపములే మానవునికి ప్రయోజనములు
మానవుని జీవన విధాన కార్య క్రమములు మహా రూపములతో సాగే మహోత్తర నిర్మాణములు
అణువు ఐనా రూపమైనా బంధమై ఒకటిగా ఉంటేనే మహా రూపములు దృఢమై నిర్మాణములుగా నిలిచివుంటాయి
ప్రకృతి స్వరూపములైనా ఎల్లప్పుడూ ఉద్భవిస్తూనే బంధమై దృఢమై మహా వృక్షాలుగా అరణ్యమై నిలిచివుంటాయి
అణువులతో మొదలై పరమాణువులతో పరస్పరం సంయోగమై ఉద్భవిస్తూనే మహా రూపాలుగా అవతరిస్తూనే ఉంటాయి
ఆకృతులుగా మొదలై ఆకారరూపాలుగా పరస్పరం బాంధవ్యమై ఉద్భవిస్తూనే మహా స్వరూపాలుగా ఆకర్షిస్తూనే ఉంటాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion