సూర్యోదయాన మేల్కొనుటలో మేధస్సు విశ్వపు అంచుల దాకా ఆలోచించే ఉత్తేజత్త్వాన్ని కలిగివుంటుంది
సూర్యాస్తయాన నిద్రించుటలో మేధస్సు శరీరం అంచుల దాకనే ఆలోచించే పరధ్యాసత్త్వాన్ని కలిగివుంటుంది
ఉదయం ఆలోచించుటలో ఎటువంటి కార్యాన్ని చేయాలన్నా మేధస్సు సూర్యోదయ తేజంతో సామర్థ్యాన్ని కలిగివుంటుంది
సాయంత్రం ఆలోచించుటలో ఎటువంటి కార్యాన్ని చేయాలన్నా మేధస్సు సూర్యాస్తమయ వర్ణంతో విశ్రమత్త్వాన్ని (విరామ శాంతాన్ని) కలిగివుంటుంది
మన లక్ష్యం ఎటువంటిదైనా పగలు సూర్యోదయ వేళ శ్రమించేలా ఉత్తేజత్త్వాన్ని అధిక సామర్థ్యంతో కలిగివుండాలి అలాగే వీలైనంతగా సూర్యాస్తమయ సమయ వేళకు ముందే కార్యాలను ముగించుకునేలా చేసుకోవాలి అప్పుడే మన శరీరం మరుసటి రోజుకు మరింత సామర్థ్యాన్ని విరామంతో పునరాభివృద్ధి చేసుకుంటుంది ఆరోగ్యంతో ఎంతో కాలం దృఢత్త్వంతో సాగిపోతుంది
మేధస్సుకు అలసట కలిగినా శరీరానికి సహనం తగ్గిపోయినా దేహానికి విశ్రాంతి నిద్ర ఆహారం ప్రశాంతత అవసరం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి