సూర్య దేవా! నీవు జీవించుటలో ప్రకృతిలో పంచభూతములు సామర్థ్యంతో జీవిస్తున్నాయి
నీవు ఉదయించుటలో విశ్వ పంచభూతములన్నీ పరిశుద్ధమై పరిపూర్ణమై ఉద్భవిస్తున్నాయి
నీవు లేని రోజుల కాల సమయంతో పంచభూతములు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా వృధా అవుతున్నాయి
పంచభూతాల పదార్థములు ఎంతో పరిమాణములతో ఎన్నో కాల సమయాలతో వృధా అవుతూ వ్యర్థమవుతున్న్నాయి
పదార్థాలు జీవిత కాల సమయాలతో పాటు వాతావరణ ఉష్ణ స్థితి పరిస్థితులతో ఋతువుల కాల పరిస్థితులతో పంచభూతములు వివిధ రకాల మార్పులతో ఆహార పదార్థాలను పత్ర పుష్పాలను సహజ వనరులను ప్రకృతి పర్యావరణాన్ని అల్లకల్లోలం చేస్తూ వృధాగా మారుస్తుంది
నీవు ఉదయించుటలో అనేక రకాల ప్రకృతి పదార్థాలన్నీ పరిశుద్ధమై కార్యక్రమాలు పరిపూర్ణంగా సాగిపోతాయి
నీ ఉదయంతోనే జీవులన్నీ ఉత్తేజంతో మెలకువ చెంది కార్యక్రమాలను శక్తి సామర్థ్యాలతో దివ్యంగా సాగిస్తాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి