మనస్సు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మనస్సు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, ఆగస్టు 2017, గురువారం

మరణమిదే మనస్సు తలచిన సమయమిదే

మరణమిదే మనస్సు తలచిన సమయమిదే
మేధస్సుకే తెలిసి తెలియని భావ తత్వమిదే

జీవమిదే శ్వాస తపించిన ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఇదే
దేహమిదే హృదయం తెలిపే పర ధ్యాన గమనమిదే   || మరణమిదే ||

ఏనాడో జన్మించిన కాలం మరణాన్నే మరచిన సమయం ఏదో
ఏనాడో తలచిన మరణం ఏనాటికో తెలియని సందర్భం ఏదో

జీవించే శ్వాసపై ధ్యాసతో గమనమై జీవించేస్తున్నా
తపించే హృదయమే ధ్యాన గమ్యమై ప్రయాణిస్తున్నా   || మరణమిదే ||

తెలియనివి ఎన్నో తెలియుట కొరకే తపనమే సాగుతున్నది
తెలిసినవి ఎన్నో తెలుపుట కోసమే తరుణమే వెళ్ళుతున్నది

ఎన్నెన్నో నేర్చిన వన్నీ మరణ సమయాన్ని తపించలేదే
ఎన్నెన్నో మరచిన వన్నీ మరణ భావత్వాన్ని తెలుపలేదే   || మరణమిదే || 

21, ఆగస్టు 2017, సోమవారం

శిల్పమా నవ రూపమా తేజమే నీ మౌనమా

శిల్పమా నవ రూపమా తేజమే నీ మౌనమా
శిల్పమా నవ భావమా వర్ణమే నీ స్వప్నమా

కలలకే రూపమా కన్నులకే మహా అందమా
కవితలకే భావమా కవులకే మహా ఆనందమా   || శిల్పమా ||

వయస్సుకే వయ్యారామా మనస్సుకే శృంగారమా
ఉషస్సుకే ఉత్కంఠమా మేధస్సుకే మాధుర్యమా

సొగసుకే సోయగమా నాదానికే నయగారమా
ఉన్నతికే ఔదార్యమా సరసానికే సౌందర్యమా  || శిల్పమా ||

మాటలకే మందారమా మౌనానికే మనోహరమా
సువర్ణాలకే సౌఖ్యమా సుగంధాలకే సుందరమా

బంధాలకే సౌభాగ్యమా రాగాలకే రమణీయమా
భావాలకే అతిశయమా అందాలకే ఆనందమా  || శిల్పమా ||

4, మే 2017, గురువారం

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే
జగతికే తెలియని ఊహలు ఎన్నో మేధస్సులలోనే ఆగిపోయెనే

ఎవరికి తెలియని జీవ భావాలు ఆలోచనలలోనే నిలిచిపోయెనే
ఎవరికి తెలియని దేహ తత్వాలు మనస్సులలోనే ఉండిపోయెనే  || చరిత్రకే ||

ఎవరి జీవితం వారికే తెలియునని
ఎవరి సుఖ దుఃఖాలు వారికే చెందునని
ఎవరి మనస్సులో వారే ఒదిగిపోయేనని
ఎవరి మేధస్సులో వారే ఉండిపోయేనని
చరిత్రగా ఎవరికి వారే నిలిచిపోయేనని
గతంలో జరిగిన మహా కథనాలే చరిత్రగా మారేనని
భవిష్య కాల చరిత్రాలే మహా పరిశోధన ప్రజ్ఞానమని  || చరిత్రకే ||

చరిత్రలో ఎన్నో కథనాలు జరిగిపోయేనని
కథలు కథలుగా కలలెన్నో కలిసిపోయేనని
జీవుల స్వభావ తత్వాలు ఎన్నెన్నో చెప్పేనని
కాలమే పురాణాలుగా సాగుతూ మనతో వచ్చేనని
ఎన్నో గొప్ప ఆలోచనలు మహా కార్యాలుగా సాగేనని
మన చరిత్ర నిర్మాణాలు సంపుటాలుగా భోదించేనని  
అనుభవాలకే చరిత్ర పరిశోధనలు విజ్ఞానమయ్యేనని  || చరిత్రకే ||

21, మార్చి 2017, మంగళవారం

ప్రేమ తెలిసేనా మనస్సు తెలిపేనా

ప్రేమ తెలిసేనా మనస్సు తెలిపేనా
వయస్సుకే తోచేనా మేధస్సుకే కలిగేనా
ఆలోచనల అర్థాన్ని అనుభవం నేర్పేనా
కాలంతో సాగే ప్రేమ ప్రయాణం జీవితమేనా
ప్రియతమా ... మధురిమా ... నీవే నాలో మౌనమా ... !   || ప్రేమ ||

జరిగిన అనుభవం కాలమే తెలిపిన గుణ పాఠం
జరిగే వేడుక మనకు లేదని తెలిసిన గుణ భావం

ప్రేమయే పెళ్లిగా సాగిన కథనం మనకే తెలియని విషయం
మరోకరితో నడిచిన కాలం మనకు తెలిసిన నూతన జీవితం

ప్రేమ భావం స్నేహంతో సాగే జీవితం
పెళ్లి బంధం మనస్సుతో కలిసే జీవనం   || ప్రేమ ||

పెళ్లితో సాగే బంధం మనకు కలగని అనుబంధం
పెళ్లితో స్నేహం దూరమై మనం కలవని సంబంధం

స్నేహమే ప్రేమగా మారినా పెళ్లిగా మారని అనురాగం
స్నేహమే బంధమై ప్రేమగా పెళ్లితో లేనిదే అనుభవం

ప్రేమకు అర్థం పెళ్లితో పరమార్థం
స్నేహానికి అర్థం బంధంతో సౌఖ్యం   || ప్రేమ || 

26, జనవరి 2017, గురువారం

ఎవరినో ఎక్కడి వాడినో ఎలా ఉండెదనో తెలియదే నా వేద మనస్సుకు

ఎవరినో ఎక్కడి వాడినో ఎలా ఉండెదనో తెలియదే నా వేద మనస్సుకు
ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండగలనో తోచదే నా జీవ జ్ఞాన దేహ మేధస్సుకు  || ఎవరినో ||

పరలోక విశ్వ విధాత ద్వారమున స్వరస్వతిని దర్శించెదను
ఇహలోక విశ్వ విధాత ప్రవేశమున పర బ్రంహను పూజించెదను

బహు మేఘాల గగన పరంపరలలో మహాపర దేవతలనే కొలిచెదను
పాతాళ గంగాజల పరంపరలలో జల దేవ మూర్తులనే స్మరించెదను   || ఎవరినో ||

విశ్వ ప్రకృతి మాతృ మూర్తి భావ తత్వాలనే ధరించెదను
జగతి స్వరూప మహా గుణ ఆకార రూపాలనే తపించెదను

దైవ ప్రభావాల కాల ఋతువుల వసంతములనే స్వీకరించెదను
దేహ జీవముల ఆకార వర్ణ రూపముల కార్యాలతో సాగిపోయెదను   || ఎవరినో || 

27, డిసెంబర్ 2016, మంగళవారం

ఏనాటిదో రూపం ఎప్పటిదో కాలం ఎంతటిదో జీవం

ఏనాటిదో రూపం ఎప్పటిదో కాలం ఎంతటిదో జీవం
మరవలేని జ్ఞాపకాలతో మర్మమై నాతో సాగుతున్నది

ఎందుకో స్వప్నం ఎవరికో ఊహం ఏనాటికో వాంఛనం
తీరలేని కోరికలతో తీరిపోతున్నది జన్మజన్మల బంధనం  || ఏనాటిదో ||

రూపానికి తేజం లేదుగా కాలానికి కరుణ రాదుగా శ్వాసకు సంతృప్తి అసలే ఉండదుగా
తెలిసిన జ్ఞాపకాలతో సాగుతున్నా హృదయం దుఃఖ సాగరమై కన్నీటితో తెలిపేనుగా

కోరికలు ఎన్నున్నా తీరని ఆశల వాంఛనాలు ఊహలతో స్వప్నాలుగా మిగిలేనులే
ప్రతి జన్మలో కోరికలు ఏవైనా తీరని భావాలతో ఆలోచనలు బంధాలుగా సాగేనులే   || ఏనాటిదో ||

ప్రాణమే ఉన్నా రూపమే జీవిస్తున్నా కాలమే మహా చలనమై సాగేను విశ్వంతో
భావమే ఉన్నా బంధమే సాగుతున్నా తత్వములే యుగాలుగా సాగేను జగంతో

దేహానికి రూపం ఏదైనా కాలంతో సాగే మార్పులు ఏవైనా కోరికలు మనస్సుకే
మేధస్సుకు ఆలోచనలు ఏవైనా సాధనతో సాధించే లక్ష్యాలు హృదయానికే  || ఏనాటిదో ||

1, డిసెంబర్ 2016, గురువారం

ఉదయించే సూర్య కిరణమా ప్రతి కోణంలో మెరిసే కిరణాల తేజమా

ఉదయించే సూర్య కిరణమా ప్రతి కోణంలో మెరిసే కిరణాల తేజమా
విశ్వానికే మహా ఉదయమా ప్రతి అణువుకు తేజస్సు భావాల ఉత్తేజమా
జగమంతా నవ జీవన కాలమా ప్రతి సమయం జీవితానికే శుభోదయమా  || ఉదయించే ||

తేజస్సుతో మేధస్సు ఉత్తేజమా ఆలోచనతో మేధస్సు నవ ఉదయమా
భావాలతో ఆలోచనలే మహోదయమా స్వరాలతో స్వరమే స్వరాగమా

దేహంలో దాగిన ఆశయాలకు ఉత్తేజం సూర్యోదయంతో మెరిసే ఆకాశమే
మనస్సులో నిండిన కోరికలకు ప్రాణం సూర్యునితో సాగే కార్యాల నేస్తమే  || ఉదయించే ||

ఉదయించే ప్రతి సూర్య కిరణం అస్తమించేను ఆనాడే కనిపించేను మరో దేశాన
మెరిసే ప్రతి కిరణ తేజం ప్రతి జీవికి అణువుకు ఎంతో ఉపయోగమే ప్రతి దేశాన

జగమంతా విజ్ఞానం సూర్యోదయాల ఉత్తేజ కార్యాలతో గమానార్థ పరిశోధనమే
విశ్వమంతా పరిశోధనం నవోదయ భావాల సూర్య విజ్ఞాన ఆలోచనల వేదమే  || ఉదయించే || 

17, అక్టోబర్ 2016, సోమవారం

వర్ణాల రూపమా గంధాల భావమా

వర్ణాల రూపమా గంధాల భావమా
సువర్ణాల స్వభావమా సుగంధాల తత్వమా
సువాసనల జీవమా సుమధురాల సౌందర్యమా  || వర్ణాల ||

నీలోని భావాలే నాలో మొదలైన స్వప్నాల సౌఖ్యాలే
నీలోని గాలులే నాలో సోకిన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే

నీ మేధస్సులో ఆలోచనై నేనే ఉండి పోతాను హాయిగా
నీ మనస్సులో మౌనమై నేనే నిలిచిపోతాను శాంతంగా

నీ దేహం నాకు తోడైన వేళలో జీవితమే వేదాల సాగరం
నా రూపం నాకు నీడైన వేళలో జీవనమే వేదాంతాల తీరం  || వర్ణాల ||

నీ కోసమే జీవితం నీ ధ్యాసతో నా లోనే ప్రయాణం
నీ కోసమే జీవనం నీ భావనతో నా కార్యాల గమనం

నీవు వస్తుంటే చిరు గాలితోనైనా నా భావాలతో జీవిస్తాను
నీవు చూస్తుంటే చిన్న ఆశతోనైనా నా కార్యాలను సాగిస్తాను

నీవే నా బంధమై అనుబంధనాన్ని పెనవేసుకో
నీవే నా స్వర రాగమై అనురాగాన్ని పంచేసుకో  || వర్ణాల || 

4, అక్టోబర్ 2016, మంగళవారం

ఒక శ్వాసగా ఒక ధ్యాసగా సాగేనే నా మనస్సు

ఒక శ్వాసగా ఒక ధ్యాసగా సాగేనే నా మనస్సు
ఒకే భాషగా ఒకే యాసగా సాగేనే నా వయస్సు
నాలోని హృదయమే నీలో ఒకటై జీవిస్తున్నదే
నేను నేనుగా లేక నీలోనే నీతో ఉండిపోయానే  || ఒక శ్వాసగా ||

ప్రేమించే భాషకు అర్థం ఒకటేనని తెలిపినదే నా మనస్సు
ప్రేమించే ధ్యాసకు లోకం ఒకటేనని తెలిపిందే నా వయస్సు

ప్రేమతో సాగే నా శ్వాస నీతోనే ధ్యాసగా సాగుతున్నదే
ప్రేమతో సాగే నా మనస్సు నీతోనే మౌనమై పోయినదే  || ఒక శ్వాసగా ||

ప్రతి శ్వాసలో నీ ధ్యాసే నన్ను జీవింపజేస్తున్నది
ప్రతి ధ్యాసలో నీ శ్వాసే నన్ను పలికించేస్తున్నది

ప్రతి క్షణం ఒక ధ్యాస ఒక శ్వాస అదే నా ప్రియమైన భాష
ప్రతి నిమిషం ఒక ధ్యాస ఒక శ్వాస అదే నా ప్రియతమ ఘోష  || ఒక శ్వాసగా || 

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మనిషిగా ఉదయించాము ఋషిగా ఎదుగుతున్నాము

మనిషిగా ఉదయించాము ఋషిగా ఎదుగుతున్నాము
కాలంతో కార్యాలనే సాగిస్తూ సమయంతో నడిచెదము

సూర్యుడు లేనిచోట విశ్వానికే సూర్యోదయం లేదంటు
సూర్యాస్తమయంతో జగతికి చీకటే పడుతుందంటా

జనులకు కావాలి విశ్వ జగతి ఇచ్చే ప్రేమే వెలిగేలా
జనులే చెప్పేరు సూర్యునికే జయహో జనతా జై జై మాతా  || మనిషిగా ||

మాటలతో సాగే స్నేహం ప్రేమగా మారే మన జీవం
మనస్సుతో కలిసే ప్రేమ జీవితాన్ని ఇచ్చే ప్రతి రూపం

మనస్సులు కలవక ముందు ఎవరికి ఎవరో తెలియము
మాటలు కలిసిన తరువాతే స్నేహ ప్రేమని తెలిసేను

జనులంతా ప్రేమతో చెప్పేరు జయహో జనతా జై జై మాత  || మనిషిగా ||

ప్రేమే లేదన్న చోట హృదయమే దుఃఖించెను
ప్రేమే కాదన్న చోట మనస్సే తడబడి పోయేను

ప్రేమే లేని నాడు ప్రేమించే తల్లి హృదయం ఆగేనా
ప్రేమే లేని రోజు మన విశ్వ జగతి తల్లడిల్లి పోయేనా

జనులంతా ప్రేమకై  చెప్పేరు జయహో జనతా జై జై మాత  || మనిషిగా ||

21, సెప్టెంబర్ 2016, బుధవారం

ఉన్నావయ్యా నీవు మాలోనే ఉన్నావయ్యా

ఉన్నావయ్యా నీవు మాలోనే ఉన్నావయ్యా
ఉంటావయ్యా నీవు మాతోనే ఉంటావయ్యా
ఎన్నాళ్ళైనా ఏనాటికైనా నీవు మావాడివయ్యా  || ఉన్నావయ్యా ||

శ్వాసలో ధ్యాసవై ఊపిరిలో ఉచ్చ్వాస నిచ్చ్వాసవై ఉంటావులే
ధ్యానంలో దైవమై దేహంలో జీవమై మహా ప్రాణంగా ఉంటావులే

పరంధామగా పరమాత్మగా మా వెంటే వచ్చెదవు
మహాత్మగా మహర్షిగా మాలోనే ఉండి పోయెదవు   || ఉన్నావయ్యా ||

మాధవుడై మా మనస్సులో మహా భావాలతో దాగేవు
మహాత్ముడై మా మేధస్సులో మహా జ్ఞానాన్నే ఇచ్చేవు

హృదయంలో వెలసిన రూపం నీలాంటి ఆకాశాన్నే సూచిస్తున్నది
మదిలో కొలువైన ఆకారం నీలాగే సూర్యోదయమై వెలుగుతున్నది  || ఉన్నావయ్యా || 

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

సుఖమో జీవితమో

సుఖమో జీవితమో
సుఖమే సంయోగ సంభోగమో
జీవితమే సుఖమైన సంతోషమో  || సుఖమో ||

సాగే కాలంతో సుఖ జీవిత ప్రయాణమో
కదిలే సమయంతో మహా సంభోగ భావమో

మోహమే మహా వేదమో వేదమే మహా మోహనమో
మనస్సే మహా మంత్రమో వయస్సే మహా చిత్రమో  || సుఖమో ||

ఎదిగే వయస్సుతో సాగే కాలంతో జీవితం ఏ ప్రయాణమో
ఒదిగే మనస్సుతో కదిలే సమయంతో నవ జీవన మార్గమో

ఒడిదుడుకులు ఎన్నున్నా సుఖ భోగం ఎవరికి శాంతమో
అలజడులు ఎన్నున్నా సంతోష యోగం ఎవరికి మోక్షమో  || సుఖమో || 

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఆహా! గాలిలో గమ్మత్తైన మైకమో

ఆహా! గాలిలో గమ్మత్తైన మైకమో
ఓహో! మేఘంలో ఆశ్చర్య వర్ణమో
మేఘాల గాలి సవ్వడిలో ఎదో నవ భావమో కలిగే మనలో మహా సంతోషము || ఆహా! ||

వీచే చల్లని గాలి తీరు మేధస్సునే మెప్పిస్తూ హుషారునే కలిగిస్తున్నది
ఆకాశంలో మేఘాల తీరు ఎన్నో వర్ణాల ఆకార రూపాలతో మెరుస్తున్నది

మెల్ల మెల్లగా వీచే మత్తైన గాలి మనస్సుకే హాయిని గలిగిస్తూ సాగుతున్నది
సూర్య కిరణాల తేజస్సుతో ఆకాశ వర్ణమే మారి అద్భుతాన్ని చూపిస్తున్నది  || ఆహా! ||

చల్లని గాలి గంధర్వ లోకాల నుండి సుగంధమై వీస్తున్నదేమో
మేఘాలే మహా పర్వతాల నుండి సువర్ణమై మెరుస్తున్నాయేమో

మేఘాల గాలికి మనలోని జీవమే మహా కొత్త ఉచ్ఛ్వాస నిచ్చ్వాసాలతో సాగేనే
మేఘాల వర్ణాలకు మేధస్సులో మహా ఉత్తేజమే ఉప్పొంగి దేహమే చలించేనే  || ఆహా! ||

13, సెప్టెంబర్ 2016, మంగళవారం

ప్రేమతో పలికిన మనస్సుతో పిలిచిన వచ్చేస్తానే నేను నీకోసం

ప్రేమతో పలికిన మనస్సుతో పిలిచిన వచ్చేస్తానే నేను నీకోసం
భావంతో తలిచిన మౌనంతో తపించిన చేరేస్తానే నేను నీకోసం  || ప్రేమతో ||

హృదయంలోని గమనమే నీ ప్రేమ తలుపుల పదనిసలు
దేహంలోని మధుర గమకమే నీ తేనే పెదవుల సరిగమలు

ప్రకృతిలో విరిసిన పుష్పాలన్నీ సుమగంధమై నిన్నే చేరేనే
ఆకాశంలో కనిపించే వర్ణాలన్నీ సువర్ణమై నిన్నే ఆవరించేనే  || ప్రేమతో ||

సూర్యోదయం నీకోసమే ఉదయించేలా ప్రతి రోజు అనిపించేనే
శుభోదయం నీకోసమే స్మరించేలా ప్రతి నిమిషం అనుకున్నానే

ఎక్కడ వెళ్ళినా నీ హృదయ భావన నన్నే చేరేనులే
ఎక్కడ చూసినా నీ దేహ బంధం నన్నే తలచేనులే  || ప్రేమతో || 

9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నీవే నీవే నాలోన నీవే నీవే

నీవే నీవే నాలోన నీవే నీవే
నీవే నీవే నాతోన నీవే నీవే
ఏమో ఏమో ఇది ప్రేమేనేమో
తెలిసేదాక తపనంతో సాగే భావన ఎదో నాలో   || నీవే నీవే ||

కాలంతో వచ్చేస్తాను సమయంతో ఉండేస్తాను నీతోనే ప్రయాణం చేసేస్తాను
కాలంతో పరుగులు తీస్తూ సమయంతో అడుగులు వేస్తూ నీతోనే నిలిచేస్తాను

భావంతో సాగే తీరు మౌనంతో ఆగే జోరు మాటలతో నిలబడిపోయేను
వేదంతో కలిగే మాట దేహంతో వెళ్ళే బాట విజ్ఞానంతో ఆగిపోయాను    || నీవే నీవే ||

కాలంతో కలిగే భావన రోజుతో మారే ఆలోచన జ్ఞాపకాలలో దూరమైపోయేనే
జీవనమే ముఖ్యమని జీవితమే అనిత్యమని ఏదీ తెలియక నీతోనే సాగేనే

తీరం చేరని హృదయం కలవని మనస్సుల దూరం ప్రేమకు భారమే
వైనం తెలియని మార్గం కనిపించని భావాల స్నేహం ప్రేమకు మోహమే  || నీవే నీవే || 

31, ఆగస్టు 2016, బుధవారం

ప్రేమంటే తెలిసేనే మనస్సంటే తెలిసేనా

ప్రేమంటే తెలిసేనే మనస్సంటే తెలిసేనా
ప్రేమించాలని నీలో భావమే నేడు కలిగేనా   || ప్రేమంటే ||

ప్రేమంటే భావన కలిగేనా నీ మనస్సులో తెలియకనే
ప్రేమంటే తెలియకనే నీ మనస్సులో మొదలాయనే

ప్రేమిస్తే మనస్సులో ఏదో తెలియని ఆర్ద్రత కలిగేనా
ప్రేమిస్తే మేధస్సులో ఏదో తెలియని ఆతృత పుట్టేనా

ప్రేమలో భావాలు ఎన్నో ప్రేమించే స్వభావాలు మరెన్నో
ప్రేమలో కలిగే భావాలలో మంచిని తెలిపే స్వభావాలెన్నో  || ప్రేమంటే ||

ప్రేమతో సాగే స్నేహం పెళ్లితో కొనసాగడమే జీవితం
ప్రేమతో సాగే జీవితం కలసి మెలసిపోవడమే జీవనం

ప్రేమతో కలిగే అనురాగం మరో ప్రేమను పంచే జననం
ప్రేమతో కలిగే ఆప్యాయత మరో ప్రేమకు స్ఫూర్తి గమనం

ప్రేమలో కలతలు ఎన్ని కలిగినా అనుకువతో అర్థాలను గ్రహిస్తేనే పరమార్థం
ప్రేమలో లోపాలు ఎన్నున్నా ఒదిగిపోవడమే మన ప్రేమను తెలిపే గౌరవార్థం || ప్రేమంటే ||

కలే కన్నానని మెలకువ తెలిపేనే

కలే కన్నానని మెలకువ తెలిపేనే
నిజమే కాదని ఉదయంతో తోచేనే
ఎన్నెన్నో కలలు కంటూనే నిద్రిస్తున్నానులే
కలలన్నీ కలలుగానే మిగిలి పోతున్నాయిలే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్నదని మరో ఊహ కలగా సాగుతున్నదిలే
కలే జీవితమని ఊహలతోనే కాలం మరుపుతో సాగేనులే

కల నిజం కాదని తెలిసినా ఊహతో ప్రయత్నమే మొదలాయనే
కల సాధ్యం కాదని తెలిసినా ఓర్పుతో సాధన ఆరంభమయ్యేనే

కలను అందుకోవాలని మనస్సులో కోరిక పుట్టేనే
కలను జయించాలని మేధస్సులో ఆలోచన తట్టేనే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్న వేళ మదిలో సంతోషమే కలిగేనే
కలే నిజమౌతున్న వేళ యదలో ఆనందమే ఉప్పొంగేనే

అన్నీ కలలు తీరవు అన్నీ కలలు మనకు గుర్తుగా ఉండవు
అన్నీ కలలు మంచివి కావు అన్నీ కలలు ఒకటిగా ఉండవు

ఆలోచిస్తేనే భావంతో కల ఎటువంటిదో తెలిసేను  
ఊహతో నెమరువేస్తేనే కల ఏమని అర్థమయ్యేను  || కలే కన్నానని || 

29, ఆగస్టు 2016, సోమవారం

హృదయమే భావంలా మనస్సే తత్వంలా మేధస్సులో స్వభావం కలిగేనే

హృదయమే భావంలా మనస్సే తత్వంలా మేధస్సులో స్వభావం కలిగేనే
మాటల్లో మౌనం ఆలోచనలో వినయం చూపుల్లో విధేయత కలుగుతున్నదే  || హృదయమే ||

ఆత్మగా జీవించే దేహం శ్వాసతో సాగే జీవం యదలో నిలిచిపోయేనే
మహాత్మగా సాగే సంభాషణ పరమాత్మగా సాగే అన్వేషణగా పోయేనే

జీవితం కాలంతో ప్రయాణించినా శరీరంలో ఊపిరి ఆడుతున్నదే
జీవనం సమయంతో సాగుతున్నా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే సాగునే  || హృదయమే ||

హృదయంలో సూర్యోదయమే సువర్ణమై ఉదయిస్తూ మేధస్సులో జీవిస్తున్నదే
మనస్సులో శుభోదయం కలుగుతూ ఆలోచనలలో ఉత్తేజత్వమే ప్రకాశిస్తున్నదే

మహాత్మగా ఎంత ఎదిగినా మహా తత్వాలెన్నో విశ్వములో దాగిపోయేనే
పరమాత్మగా ఎలా ఒదిగినా మహా స్వభావాలెన్నో జగతిలో నిలిచిపోయేనే  || హృదయమే || 

23, ఆగస్టు 2016, మంగళవారం

హృదయంలో ఆరంభం మనస్సులో అనంతం

హృదయంలో ఆరంభం మనస్సులో అనంతం
ఎదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో ఉత్తేజం
ఆలోచనలలో ఆరాటం మేధస్సులో ఆర్భాటం
ఎప్పుడో ఆవేదం ఎన్నడో ఆవేశం ఎందుకో ఆధ్రతం  || హృదయంలో ||

పరుగులు తీసే వయస్సు పరిగెత్తించే మనస్సు ఏనాటిదో
ప్రేమించే భావం ఆలోచించే తత్వం అడుగులు వేసే స్వభావం

అదిగో మన ప్రేమ సూర్యోదయంలా ఉదయిస్తున్నది
ఇదిగో శుభోదయమై మన ప్రేమ జీవితం చిగురిస్తున్నది

ఎన్నడు లేని ఆనందం మనలోనే కొత్తగా జీవిస్తున్నది
ఎప్పుడు లేని ప్రశాంతం మనతోనే జత కలుస్తున్నది    || హృదయంలో ||

కలిగేనే మనలో అద్భుతం మెలిగేనే మనలో వసంతం
వెలిగేనే యదలో అనంతం కురిసేనే మదిలో ఆరాటం

సంతోషమే సంభరమై ఉల్లాసమే ఉత్తేజమై జలపాతమే పులకరించేనే
సమయమే సందర్భమై ఆలోచనలే వేదాంతమై విజ్ఞానమే వికసించేనే

ఆలయమే మన సన్నిధి హృదయమే మన జీవనది
మనస్సే మన అవధి వయస్సే మన పెన్నిధి మన గడవు  || హృదయంలో ||

1, ఆగస్టు 2016, సోమవారం

మాటలో ఏముంది మనస్సులో ఏముంది

మాటలో ఏముంది మనస్సులో ఏముంది
ఆలోచనలో సందేహమై మేధస్సులో సందిగ్ధమైనది  || మాటలో  ||

మాటలకై తడబడిపోయా మనస్సులో తపించిపోయా
ఆలోచనలతో ఏవేవో ఎన్నో ఊహిస్తూ తపనపడిపోయా

విజ్ఞానముతో స్పష్టత లేక మేధస్సులో సందిగ్ధమై పోయేనే
అనుభవంతో పరిచయం లేక మదిలో సందేహమై పోయేనే  || మాటలో  ||

జీవిత కాల ప్రయాణంలో ఏది మహా విజ్ఞానమో తోచటం లేదు
జీవన కాల అభివృద్ధిలో ఏది నిత్య సత్యమో నాలో నిర్ణయం లేదు

తెలుసుకోవాలని ఉన్నా తెలియనిదే ఎంతో ఉందని మనస్సులో అనిత్యం
తెలుసుకున్నది ఏదైనా ఎక్కడ ఉపయోగమవుతుందో మేధస్సుకే సందిగ్ధం || మాటలో  ||