నీవు యంత్రాలతో కాలక్షేపం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నావని అనుకుంటున్నావా
నీవు చేసే కాలక్షేపాన్ని చూస్తూ నీ చుట్టూ జీవిస్తున్న వారికి పిచ్చి కలుగుతున్నది మతి పోతున్నది నీతో చెప్పుకోలేక మనస్సులో మేధస్సులో పిచ్చి తనాన్ని దాచుకుంటూ కుటుంబ అభివృద్ధిని ఎన్నో రకాలుగా ఎంతో కాలంగా కోల్పోతున్నారు జీవితాన్ని శ్రమతో సాగిస్తూ అనారోగ్యం చెందుతూనే ఉన్నారు నిన్ను గమనిస్తూనే ఉన్నారు
ఉపయోగం లేని నీ కాలక్షేపాన్ని ఆపేందుకు ప్రయత్నించవచ్చు ఐతే నీ ప్రవర్తన మాటల తీరు సరైన విధంగా లేనందున అసభ్యకరంగా ఉన్నందున నిన్ను అలా వదిలేస్తున్నారు అది నీకు అర్థం కావటం లేదు పరమార్థంగా తెలుసుకోవటం లేదు తెలిసినా మారటం లేదు అవివేక ఆలోచనలతో ఏదీ తెలియని విధంగా జీవిస్తున్నావు
నీలో ఉన్న విజ్ఞానమంతయు శూన్యమైపోయి స్వతహాగా ఆలోచించే ప్రయత్నం లేక యంత్రాలతోనే కాలక్షేపాన్ని ఆలస్యమైన ఉదయం నుండి మధ్య రాత్రుల వరకు సాగిస్తున్నావు అనారోగ్యం చెందుతున్నావు శ్రమించే వారికి విశ్రాంతిని కలిగించకుండా సేవలను అందుకుంటున్నావు సంపాదించే వయస్సులో కాలక్షేపంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులను దశాబ్దాలుగా కలిగిస్తూనే ఉన్నావు ఖర్చుల భారాన్ని పెంచుతూనే భారంగా సాగిపోతున్నావు
బంధానికి ఉపయోగం లేదు అనుబంధానికి ప్రయోజనం లేదు అనవసరమైన ఖర్చులు తప్ప అనవసరమైన ఇబ్బందులను కలిగించడం తప్ప అనవసరమైన ఆలోచనలతో అవస్థతో వివిధ రకాల అనారోగ్యములను తెచ్చుకోవడం తప్ప ఎటువంటి ప్రశాంతత లేదు బాధ్యతలను తెలుసుకోవడం లేదు శ్రమ తెలియని విధంగా తోచని విధంగా జీవిస్తున్నావు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి