31, ఆగస్టు 2026, సోమవారం

యంత్రాలతో కాలక్షేపం చేస్తూ జీవనాన్ని సాగించే జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నారు

యంత్రాలతో కాలక్షేపం చేస్తూ జీవనాన్ని సాగించే జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నారు 
అవసరాలను కూడా సౌకర్యం చేసుకొని కార్యాలను యంత్రాలతో సాగించే జీవితంగా మార్చుకుంటున్నారు 

శక్తి సామర్థ్యం అవసరం లేని విధంగా విజ్ఞానం అనుభవం లేని విధంగా యంత్రణతో కార్యక్రమాలను సాగిస్తున్నారు 
యంత్రాలే సూర్యోదయం యంత్రాలే సూర్యాస్తమయంగా యంత్రాలే దినచర్యల కాలక్షేపంగా యంత్రాలతోనే ఉద్యోగం సాగిస్తున్నారు 

ప్రతి కార్యానికి యంత్రం తోడుగా యంత్రాల నుండి మరో యంత్రాలు పనిచేసే విధంగా ఎన్నో కార్యాలను యంత్రాల సహాయంతో కార్యాలను సాగిస్తున్నారు 

మానవుని శరీరం శ్వాసతో జీవిస్తున్నా మేధస్సు మాత్రం యంత్రంతో ఆలోచించేలా జీవన విధాన కార్యాలు సాగిపోతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి