15, ఆగస్టు 2026, శనివారం

ఐశ్వర్యం ఉంటేనే అదృష్టం కలిసి వస్తుంది

ఐశ్వర్యం ఉంటేనే అదృష్టం కలిసి వస్తుంది  
ఐశ్వర్యంతో మనం ఏ కార్యాలనైనా సాగించవచ్చు 

ఐశ్వర్యంతో కుటుంబాన్ని ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని ఆస్తులను బంధాలను అభివృద్ధి చేసుకోవచ్చు 
మనకు కావలసిన వాటిని అవసరమైన వాటిని ధరలు ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయవచ్చు

ఐశ్వర్యంతో ఎటువంటి అభివృద్ధిన్నైనా సాధించవచ్చు ఎటువంటి మార్పులైనా చేసుకోవచ్చు 
ఐశ్వర్యంతో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఎటువంటి సౌకర్యాలనైనా ఏర్పాటు చేసుకోవచ్చు 

ఐశ్వర్యంతో ఎటువంటి బంధాన్నైనా కలుపుకోవచ్చు క్రొత్త బంధాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చు 
ఐశ్వర్యంతో అందరిని ఆపద నుండి రక్షించవచ్చు అందికీ విజ్ఞాన బోధన ఆరోగ్యం కలిగించవచ్చు 

ఐశ్వర్యం లేని తనం ఒంటరితనం ఆలోచనలు ఉన్నా మౌనంతో కాలాన్ని సాగించే కాలక్షేప కార్య విధానం 
ఐశ్వర్యం లేని గుణం కొలతలతో ఆలోచించే స్వభావం కొరతతో జీవించే తత్త్వం కోరికలు లేని మనస్తాపం 

ఉద్యోగం చేసుకో అన్నీ సరిచేసుకో జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అభివృద్ధితో రూపుదిద్దుకో  
ఉద్యోగం ఎంచుకో అన్నీ సరిచూసుకో జీవన విధానాన్ని విజ్ఞానంగా అనుభవంగా అద్భుతంగా మలుచుకో  

ఐశ్వర్యం ఉంటే దగ్గర ఉన్న దానిని దూరంగా ఉన్న దానిని ఎక్కడైనా ఉన్న దానిని కొనుగోలు చేయవచ్చు 
ఐశ్వర్యం ఉంటే నీ దగ్గర ఉన్న దానిని నీ చుట్టుప్రక్కల ఉన్న దానిని కూడా ఏనాడు కొనుగోలు చేయలేవు 

శ్రమ జ్ఞానం లేకుండా కార్యం లేదు ఫలితం లేదు ఐశ్వర్యం లేకుండా అభివృద్ధి లేదు ఆరోగ్యం లేదు  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి