28, ఆగస్టు 2026, శుక్రవారం

నీ స్వభావములు నీకే తెలియని తత్త్వంతో అమానుషంగా జీవిస్తున్నావు

నీ స్వభావములు నీకే తెలియని తత్త్వంతో అమానుషంగా జీవిస్తున్నావు  
నీవు జీవించుటలో ప్రయోజనం ఏదో గ్రహించని మేధస్సుతో ఆలోచిస్తున్నావు 

అవసరాలను మరచిపోయి ఇబ్బందులను గమనించలేని స్థితితో అనవసరమైన వాటితో ఖర్చులను పెంచుకుంటూ జీవితాన్ని కఠినంగా మార్చుతూ శ్రమకు సహకారం అందించకుండా అయోమయ స్థితిలో కాలక్షేపం చేస్తూ అభివృద్ధి లేకుండా విజ్ఞానాన్ని అజ్ఞానంగా ఆరోగ్యాన్ని అనారోగ్యంగా చేసుకుంటూ సమయాన్ని పరధ్యాసగా చూసుకుంటూ నిర్లక్ష్యంతో నిరాకారంతో జీవిస్తున్నావు 

జీవించుటలో భ్రమ ఉన్నదో ఏమో శ్రమకు కూడా తెలియని సహనం సహించలేని స్థితితో సాగుతున్నది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి