28, ఆగస్టు 2026, శుక్రవారం

దేవతా రూపం ధరించిన నీకు శ్రమించే సహనం లేదా

దేవతా రూపం ధరించిన నీకు శ్రమించే సహనం లేదా 
అలంకారంతో నిలయమైన నీకు ఐశ్వర్య భాగ్యం లేదా 

భాగస్వామితో సేవలను అందుకుంటున్న నీకు సామర్థ్యం లేదా  
భాగ్యములతో వెలుగుతూ కనిపిస్తున్న నీకు స్వదేహాలయం లేదా 

విజ్ఞానంతో ఆలోచనలను ప్రదర్శించే నీకు పరిశ్రమల ప్రదేశాలే లేవా  
అనుభావాలతో విజ్ఞానాన్ని అనుసరించే నీకు శ్రమించే ప్రదేశాలే లేవా 

ఏ స్థానం లేని నీవు గర్భగుడి ఒడిలోనే అయోమయమై ఉండిపోతున్నావా 
ఏ భాగ్యం లేని నీవు గర్భగుడి పీఠం పైననే అమానుషమై నిలిచిపోతున్నావా 

దేవతా శిల్పమై సహృదయం లేని దేహస్సుతో నిశ్చలమై పోతున్నావా 
దేవతా స్వరూపమై సులోచన లేని మేధస్సుతో నిర్భయమై ఉంటున్నావా 

ఏ పాదసేవ పుణ్యమో ఏ దేహ పుష్పమో ఏ వరము వస్త్రమో అలంకారమై ప్రకాశిస్తున్నావు 
ఏ దేహసేవ ఫలమో ఏ దైవ సుగంధమో ఏ మర్మము శాస్త్రమో పూజాప్రార్థనలతో ప్రసిద్ధమవుతున్నావు 

ఏ దేవి వరమో జనని జగన్మాతవై జన్మించావా 
ఏ దేవ శ్రమయో శ్రీమతి విశ్వమాతవై జీవించావా  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి