19, ఆగస్టు 2026, బుధవారం

ఆనాడు విజయానికే మొదటి స్థానంలో ఉండే వాడివి నేడు కాలక్షేపానికే మొదటి స్థానంలో అంకితమైపోయావు

ఆనాడు విజయానికే మొదటి స్థానంలో ఉండే వాడివి (ఉండే దానివి ) నేడు కాలక్షేపానికే మొదటి స్థానంలో అంకితమైపోయావు (యంత్రమో తంత్రమో మేధస్సుకు మనస్సుకు తెలియని విధంగా జీవిస్తున్నావు)

ఆనాడు తెలియని విజ్ఞానాన్ని సాధించి అర్థమయ్యేంత వరకు పట్టు పట్టేవు నేడు విజ్ఞానం తెలియని విధంగా కాలక్షేప జీవితాన్ని సాగిస్తున్నావు 
నీవు నేర్చిన విజ్ఞానంతోనే నీవు నీ అనుభవంతోనే సులభంగా సంతోషంగా శ్రమ లేనట్లుగా ఉద్యోగ సంపాదన చేయవచ్చు 

ఉద్యోగం శ్రమ కాదు విజ్ఞానం అని నీకు తెలిసినా అది నీకు సులభం అని తోచిన దాని వెంట అడుగులు లేక చూపులు కూడా కరువైపోతున్నాయి 
ఉద్యోగ సంపాదన నీకు అవసరం లేకున్నా నీ కుటుంబ అభివృద్ధికి ఆరోగ్యానికి భవిష్య జీవన బంధుత్వాలకైనా ఎంతో అవసరమవుతుంది తరతరాలకు ప్రయోజనమవుతుంది నీ జీవిత కాల చివరి దశకు ఎంతో ఉపయోగపడుతుంది 

నేడు ధరల ప్రభావాలకైనా ఉద్యోగ సంపాదన చాలా అవసరం 
నేటి కార్యాలన్నీ యంత్రములే త్వరత్వరగా నిర్ణీత కాలంలో చేసిపెడుతున్నాయి 

జీవితాన్ని కాలక్షేపంతో సులభం చేసుకోవద్దు యంత్రాల ప్రయోజనంతో ఉద్యోగ సంపాదనతో అవసరాలను అనుగ్రహించి సులభం చేసుకో 

ఉద్యోగ సంపాదన తెలిసేంతవరకు జీవిత లక్ష్యం జన్మ కారణం భవిష్య కాల పరిస్థితిని తెలుసుకోలేవు (అజ్ఞానంతో సాగిపోయెదవు)

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి