చెట్టుతో నిలిచి చూడు వృక్షంతో జీవించి చూడు ఆరోగ్యంతో ఎంతకాలం జీవిస్తావో తెలుస్తుంది
ప్రాణవాయువుతో ఉండి చూడు ప్రాణవాయువులో ఉండి చూడు శ్వాస ప్రయాసలో ఆరోగ్యం ఎంతో తెలుస్తుంది
ఆనాటి కాలమున జన్మించిన నాడు వృక్షములతో జీవించాము ఈనాటి సమయమున జీవించుటలో చెట్టు కూడా దూరమై పోయినది
శ్వాస ప్రయాసలో ప్రాణ వాయువు కలుషితమై ఆహార పదార్థాలు కూడా సరైన పోషకాలు లేకుండా ఆహారమై పోతున్నాయి
ఎన్నో రకాల ఎన్నో విధాల రసాయనాలతో ఉత్పత్తులు వివిధ రకాల వస్తువులుగా తయారవుతున్నాయి కాలుష్యాన్ని పెంచుతున్నాయి ఎన్నో నిర్మాణాలతో ప్రకృతి వృక్ష సంపద తగ్గిపోతున్నది ప్రాణవాయువు లేకుండా వెళ్ళిపోతున్నది
శ్వాస ప్రయాస కూడా గుండెకు అందనట్లుగా శరీర సామర్థ్యం తగ్గిపోతున్నది రక్త ప్రసరణ లేక మేధస్సు ఆలోచించడం తగ్గిపోతున్నది జీర్ణక్రియ అవస్థగా మారుతున్నది శరీర అవయవాలకు సరైన ప్రక్రియలు లేక ఇబ్బందులను కలిగిస్తున్నాయి శరీరం శ్రమించలేక వాలిపోతున్నది దేహం అనారోగ్యంతో అటుఇటు కాని పరిస్థితులతో జీవిస్తున్నట్లున్నది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి