31, ఆగస్టు 2026, సోమవారం

పద్మ పుష్పమైనను లేకుండా శ్రీహరి పాద పూజ చేయగలమా 
పుష్పము లేని పూజ శ్రీదేవి ఐనా మెచ్చునా శ్రీహరి ఐనా తపించునా 
పుష్పము లేని పూజ చేయుటకు స్త్రీ దేవి యే తన అతర్భావాలతో హరి నామ స్మరణంచే సాగించాలి చేయగలగాలి  

హరి అంటే పతి 
శ్రీమతి అంటే దేవి 
స్త్రీ శ్రీమతిగా తన భర్త (పతి) యొక్క యోగ క్షేమముల (ఆరోగ్యం రక్షణం) కోసం స్మరణం (తలచుకోవడం) చేయాలి 
స్త్రీ తత్త్వం వివిధ పరిస్థితులతో వివిధ రకాలుగా కఠినంగా ఒంటరిగా ఉన్నప్పుడు తన పతిని స్మరిస్తూ గృహ ద్వారముననే ఎదురుచూస్తూ ఉంటుంది 

భర్త (పతి) తన ప్రయాణాన్ని సూర్యోదయాన ఎక్కడెక్కడో బాటలు లేకున్నా సాగించి శక్తి సామర్థ్యాలతో శ్రమించి విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆహార పదార్థాలను సేకరించి సంధ్యా వేళ తిరుగు ప్రయాణం చేస్తూ ఆలస్యంగా చీకటిలో నడకల అడుగులను బాటలు లేని చోట కనిపించని మట్టిపై రాళ్ళపై గుంతలలో వేస్తూ తడబడుతూ తప్పిపోతూ వస్తుంటాడు 

-- వివరణ ఇంకా ఉన్నది!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి