28, ఆగస్టు 2026, శుక్రవారం

భాగస్వామిగా జీవించుటలో ప్రయోజనం లేకున్నను నష్టాన్ని కలిగించరాదు

భాగస్వామిగా జీవించుటలో ప్రయోజనం లేకున్నను నష్టాన్ని కలిగించరాదు 

భర్త ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలడు గాని నష్టాన్ని ఏ పరిస్థితిలోనూ ఓర్చుకోలేడు  
భర్త నష్టాన్ని ఓర్చుకుంటే జీవితంలో తన శ్రమకు కుటుంబ అభివృద్ధికి ప్రయోజనం ఉండదు 

భాగస్వామిగా జీవించడమంటే భర్తకైనా భార్యకైనా భాగము లేకున్నను భాగ్యములు కలగాలి 
విజ్ఞానాన్ని శ్రమను ఉద్యోగాలుగా భాగాలు చేసుకొని అభివృద్ధిని సాధించి భాగ్యములను పొందాలి 

భాగ్యములు కలుగుతున్నప్పుడే కుటుంబం స్వగృహంలో ఐశ్వర్యంతో వర్ధిల్లుతూ బంధాలతో ఆరోగ్యంతో విజ్ఞానంతో సామర్థ్యంతో ఉత్తేజమైన సహనంతో అవసరాల కార్యక్రమాలతో పరిశుద్ధతతో పవిత్రంగా కలకాలం సాగిపోతుంది 

భాగ్యములు శుభ కార్యములు అభివృద్ధితో కూడిన కుటుంబ కార్యక్రమాలు దేహానికి ప్రశాంతమైన కాంతి తేజములు దివ్య స్వరూపములు అనుబంధాల ప్రతిరూపములు మేధస్సుకు మహానంద పరధ్యాస ప్రభావితానంద ప్రభూతములు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి