28, ఆగస్టు 2026, శుక్రవారం

దేవతా! గర్భగుడిలోనే నిశ్చలమై అలంకారాలతో నిలయమై అలాగే ఉండిపోతావా

దేవతా! గర్భగుడిలోనే నిశ్చలమై అలంకారాలతో నిలయమై అలాగే ఉండిపోతావా  

ఆలయ ఆవరణాలను బాహ్య ప్రదేశాలను పరిశుద్ధమైన విజ్ఞానంతో పవిత్రంగా ఉన్నాయో లేదో వీక్షించవా 
భక్తుల దర్శనానికి కలిగే ఇబ్బందులు వారి శ్రమ పాట్లు కోరికల సర్దుబాట్లు ఎలాగ ఉన్నాయో గమనించవా 

ఆలయ దర్శనం సమయం ముగిసిన వేళ మళ్ళీ ఆలయ దర్శన ప్రారంభం అయ్యే వరకు ఆలయ మహత్య ప్రభావం ఏమిటో ఆలోచించవా ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడంతో భక్తుల ఇబ్బందులను అవసరాలను మరచిపోయావా 

నీ రూపం ప్రతి రూపంగా ఆలయంలోనే నిశ్చలమై ఉండిపోకుండా కుటుంబ బంధాల కోసం విజ్ఞానంతో శ్రమిస్తూ ఐశ్వర్యంతో అభివృద్ధిని పొందుతూ సహనంతో సాగిపోవాలి 

నీ రూపం విశ్వ విజ్ఞానంగా జగమంతా ప్రయోజనంతో జీవించేలా ఆరోగ్యంతో శ్రమిస్తూ ఉన్నత స్థాయిలో గర్భగుడిలో దేవతగా అవతరించేలా అద్భుతంగా బంధాలతో సాగిపోవాలి 

మానవులంతా సమస్యలతో అవసరాలను కూడా తీర్చుకోలేని విధంగా అయోమయంలో ఇబ్బందులతో కాలాన్ని వృధా చేసుకుంటూ అజ్ఞాన విజ్ఞాన ఇరుముడితో ముడిపడినట్లు సరైన మార్గం తెలియక అవస్థలతో జీవిస్తున్నారు 

ఇంటిలో ఉన్న రూపం సమాజానికి విజ్ఞానాన్ని అందించే దేవతగా శ్రమిస్తూ ఐశ్వర్యంతో జీవితాన్ని బంధాలుగా అవసరాలతో ఆనందంతో సమస్యలను పరిష్కారిస్తూ సాగించవా 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి