ఎంతగా శ్రమించినను సంపాదన కలుగుట కఠినంగా మారుతున్నది
శ్రమకే ఫలితం లేదని పరిశ్రమల సంస్థలే దృఢంగా తెలుపుతున్నారు
లాభాలు తమ వరకే నని తామే స్వయంగా ప్రకటనలు చేసుకుంటున్నారు
ఎంతగా ఆశించినా ప్రశ్నించినా ఎదురు చూసినా శరీరంలో సహనం కోల్పోతుందేమోగాని ఫలితం అందుకోలేవు
మన శ్రమ వారికే పరిమితం మన ఫలితం వారికే సౌకర్యం వారిదే అభివృద్ధి వారిదే జీవితం వారికే కుటుంబం బంధం అంతస్తుల భవనం
ఆహారంతో జీవనం సాగించడమే మన శ్రమలో ఏనాడో అచ్చులతో లిఖించారు
పరిశ్రమలు సంస్థలు ఎవరికీ వారు గొప్పగా లెక్కలు లేనంతగా అభివృద్ధి చెందుటకు కాదు కార్మికులతో కలసి శ్రమిస్తూ ఉత్పత్తులను సాగిస్తూ తగిన ధరలతో సమాజానికి ప్రయోజనకరంగా అందించాలి సేవా కార్యాలను చేస్తూనే లాభాలతో కార్మికులను తగిన విధంగా సౌకర్యవంతంగా కుటుంబం ఎదిగేలా చూసుకోవాలి
వస్తు సేవలను కొనుగోలు చేసే వ్యక్తులకు న్యాయం చేకూరుస్తూ కార్మికులను కూడా సంతోషంగా జీవించేలా చూసుకోవాలి అందరి జీవితాలు ఎదుగుతూ అన్ని రకాల ప్రయోజనంతో అభివృద్ధి చెందాలి
ప్రతి మానవునికి విద్య విజ్ఞానం శ్రమ నిద్ర సంపాదన విశ్రాంతి ఆరోగ్యం వైద్యం ఔషధం ఆహారం వసతి వస్త్రం అన్ని రకాలుగా అందాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి