కవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జులై 2016, గురువారం

కవితలే కవిని సృష్టించేనా కవితలే కాలాన్ని కదిలించేనా

కవితలే కవిని సృష్టించేనా కవితలే కాలాన్ని కదిలించేనా
కవితలే రేపటి విజ్ఞానాన్ని సూచించేనా కవితలే కాలాన్ని మార్చేనా  || కవితలే ||

కవిగా తెలియని కవితలు ఎన్నో
కవితలుగా తెలిపే కవులు ఎందరో
కవిగా కవితలను గుర్తింపు తెచ్చేవి ఎన్నో
కవితలే కవిని స్మరింప జేసేవి ఎన్నెన్నో   || కవితలే ||

కవితలుగా కవిని కాలంతో సాగించేవి ఏవో
కవిగా కవితలను తెలిపే కాలం ఏదో ఏనాటిదో
కవితలే కాలంతో సాగుతూ పరిచయమయ్యేవి ఏవో
కవిగా తన జీవిత కాలాన్ని కవితలుగా తెలిపేవి ఎన్నెన్నో  || కవితలే || 

27, ఆగస్టు 2015, గురువారం

విశ్వమందు కవులు ఎందరున్నను అందులో ఒకరిగా గుర్తింపు

విశ్వమందు కవులు ఎందరున్నను అందులో ఒకరిగా గుర్తింపు పొందగలనా
నేనుగా గుర్తింపు నాకు ఉన్నా తరతరాలకు నేను ఒకరిలో గుర్తు ఉండగలనా
నా భావాలు సాగిపోయేలా నేనుగా నేను ఎంతో ఎదగాలనే ఏనాటికైనా తెలియునా
నాలోని విజ్ఞాన ఆలోచనల పదజాల పోషణ సంపూర్ణంగా ఉండేలా మీకు తెలిసేనా
ఎందెందు ఏమి నేర్చినను నేను సమకూర్చే పద జాలాన్ని మీకు నేనైనా తెలిపేనా
గుర్తింపుకై ఎన్ని యుగాలు గడిచినను నా భావాలు మీ మేధస్సులలో ప్రవహించేనా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!