ప్రయాణించుటలో నీవు ఎన్నో గమనించాలి ఎన్నో తెలుసుకోవాలి ఎన్నో పాఠించాలి ఎన్నో గ్రహించాలి
నీకు ముందుగా ఉన్నది కనిపిస్తూనే ఉండాలి [మార్గం ఎలా ఉందో కనిపిస్తూనే ఉండాలి మార్గ నియమాలు పాటించాలి]
నీకు వెనుక వైపు ఉన్నది తెలుస్తూనే ఉండాలి [నీవు ప్రయాణిస్తున్న మార్గం నీకు తెలుస్తూ నీతో వచ్చే వారిని గమనిస్తూనే ఉండాలి]
నీకు ఇరు (రెండు) ప్రక్కల ఉన్నది గమనిస్తూనే ఉండాలి [ఇరువైపులా వచ్చే వారిని వారి ప్రయాణ విధానాన్ని గమనిస్తూ ఉండాలి]
నీకు క్రింద వైపు ఉన్నది సమ్మతమవుతూనే ఉండాలి [నీవు కూర్చున్న విధానం నీకు అనుకూలంగా నీ మార్గం దృఢంగా ఉన్నదో లేదో తెలుసుకోవాలి ]
నీకు పైన వైపు ఉన్నది అవగాహనవుతూనే ఉండాలి [నీకు పై వైపున ఏమేమి ఉన్నాయో ఏమేమి జరుగుతున్నాయో కాల సమయ ఋతువుల పరిస్థితుల ప్రభావాలపై అవగాహన ఉండాలి]
అన్నింటితో పాటు నీ వేగం నీ మేధస్సుకు దేహానికి శరీరానికి వాహనానికి నీతో ప్రయాణించు వారికి సైతం అదుపులో ఉండాలి సురక్షితంగా ప్రశాంతంగా గమ్యాన్ని సమయానికి అటుఇటు తొందరపాటు లేకుండా చేరుకునేలా సాగాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment