ఆరా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆరా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, నవంబర్ 2016, మంగళవారం

నీ శ్వాసతోనే నేను జీవిస్తున్నాను ప్రభూ

నీ శ్వాసతోనే నేను జీవిస్తున్నాను ప్రభూ
నీ ధ్యాసతోనే నేను ధ్యానిస్తున్నాను ప్రభూ
నీ రూపముతోనే నేను ఎదుగుతున్నాను ప్రభూ  || నీ శ్వాసతోనే ||

నీలోని పరతత్వ భావాలనే నేను గమనిస్తున్నాను
నీలోని ప్రజ్ఞాన పరంజ్యోతినే పరలోకాన చూస్తున్నాను
నీలోని ప్రతి ధ్వనినే ఓంకారముగా నేను వింటున్నాను

నీలోని దైవత్వమే నాకు మహా దేహమై ఆరాగా ప్రకాశిస్తున్నది
నీలోని అద్వైత్వమే నాకు మేధస్సై జ్యోతిగా వెలుగుతున్నది  || నీ శ్వాసతోనే ||

నీలోని సూర్యోదయమే నాలో ప్రజ్వలమై ప్రతిబింభిస్తున్నది
నీలోని సూర్యాస్తమే నాలో వెన్నెల కాంతమై విరబూస్తున్నది

నీలోని శ్వాసకు నేనే ప్రతి శ్వాసనై ప్రతి క్షణం నీతో ఉదయిస్తున్నాను
నీలోని ధ్యాసకు నేనే ప్రతి భావమై ప్రతి రోజు నిన్నే ఆరాధిస్తున్నాను   || నీ శ్వాసతోనే || 

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

నిద్రించుటలో విశ్వాసన వేయగా మహా భావ విశ్రాంతి కలుగును

నిద్రించుటలో విశ్వాసన వేయగా మహా భావ విశ్రాంతి కలుగును
విశ్వాసన అనగా విశ్వ భావనతో కూడిన సుఖ శ్వాస ఆసనయే
విశ్వ ఆసనలో శరీర స్థితి రీతి గొప్పగా ఆదరించు లక్షణ విధానమే
దేవాతా మూర్తులు ఉండగలిగే విశ్వ భావ ధ్యాన స్థితి విధానమే ఇది
విశ్వాసనతో నిద్రించుట లేదా ధ్యానించుట మహా గౌరవ లక్షణము
విశ్వాసనతో నిద్రించే వారు విశ్వ కాలంలో పొందే ఒక గడియ విశ్వానుభూతి
విశ్వానుభూతి కలుగుటలో మానవులు మహానుభావులుగా మారవచ్చు
నేడు తపించే ధ్యానం విశ్వానుభూతితో కూడిన మహా విజ్ఞాన సాధన
దేహాన్ని తన్మయం చేయుటకు కలిగే అరుదైన అవకాశమే విశ్వాసన
ఇంద్రియ నిగ్రహణతో పాటు దేహ కుండలిని శక్తి పొందే చక్రధార సప్త స్థితి
కుండలిని శక్తితో సప్త చక్రములు ఏక కేంద్రమై దేహపు ఆరాన్ని ఆవిర్భవించును