పలుకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పలుకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2017, మంగళవారం

పదములు పలికినా పలుకుల పులకరింతలు

పదములు పలికినా పలుకుల పులకరింతలు
వేదములు చదివినా వర్ణముల పలకరింతలు
అచ్చులు తెలిసినా అక్షరముల అల్లికలు
హల్లులు వ్రాసినా పదముల వాక్యములు
భాషలు నేర్చినా చంధస్సుల వ్యాకరణములు 

30, మార్చి 2017, గురువారం

స్నేహమా నీవు మరో దైవమా

స్నేహమా నీవు మరో దైవమా
స్నేహమా నీవు మరో హితమా
జీవితానికే నీవు పరమానందమా
నీవే నాలో దాగిన పర తత్వమా  || స్నేహమా ||

ఏమీ తోచని కార్యాలకు నీవే సలహా బంధమా
ఏమీ లేని రోజులకు నీవే మహా ఫల హారమా
ఏమీ కలగని సమస్యలకు నీవే పరిష్కారమా
ఏమీ కనిపించని రూపానికి నీవే ఆనందమా
ఏమీ కోరినా మార్గాన్ని చూపే మహా భావమా

మాటల పరిచయాలతో తెలిసే సమాచారమే కొత్త భావమా
జ్ఞాపకాలతో కలిసే విషయాలతో సంబంధాల స్నేహత్వమా

స్నేహం అందరికి తెలిసి తెలియని అనుభవమా
స్నేహంలో కలిగే కలహాలు మనకే గుణ పాఠమా     || స్నేహమా ||

ఎదురుగా కనిపించే రూపమే నీ స్వరూపమా
ఎక్కడ నీవు ఉన్నా నాలో ఎప్పటికి కుశలమా
ఎవరు ఉన్నా లేకున్నా నీ పలుకులే ప్రాణమా
ఎవరు రాకున్నా నీవు వచ్చే వేళయే సంతోషమా
ఎవరికి ఎవరు లేకున్నా నీ పిలుపే మహా బంగారమా

మాటల విషయాల పరస్పర సంబంధాలే స్వభావాల స్నేహమా
అవసరాల ఉపయోగాలకు తోడుగా నిలిచే వారధియే స్నేహితమా

స్నేహం ఎప్పటికి మరవని గొప్ప జ్ఞాపకమా
స్నేహం ఎప్పటికైనా ప్రతి జీవికి అనుభవమా   || స్నేహమా || 

27, జులై 2016, బుధవారం

ఏనాటిదో ఈ జీవితం ఋణమై కాలంతో సాగుతున్నది

ఏనాటిదో ఈ జీవితం ఋణమై కాలంతో సాగుతున్నది
ఏనాటికో తల్లిగా జన్మనే ఇచ్చి తన దైవం చాటుకున్నది  || ఏనాటిదో ||

ఎప్పటి వరకు తెలియని జీవం సమయంతో సాగుతున్నది
ఎవరి కొరకో తెలియని విజ్ఞానం అన్వేషణలో తెలుస్తున్నది

ఋణ బంధమైన నా జీవితాన్ని జగతికే అర్పిస్తున్నా
భావ తత్వమైన నా జీవనాన్ని లోకానికే సమర్పిస్తున్నా

దైవత్వమైన నా తల్లి హృదయం నాతోనే జీవిస్తున్నది
అద్వైత్వమైన నా తల్లి రూపం నాతోనే ఎదుగుతున్నది  || ఏనాటిదో ||

మహనీయులు అవతరించిన ఆనాటి కాలంతో సాగాలని వేదన ఆర్జిస్తున్నది
మహానుభావులు అధిరోహించిన యుగాలతోనే నడవాలని జ్ఞానం వర్తిస్తున్నది

జీవితం తాత్కాళికమైన విజ్ఞానం శ్వాశ్వితమైనదిగా ఆరోపణిస్తున్నది
జీవనం తక్షణ మరణమైనా అనుభవం భవిష్యతుకు ఆలోచిస్తున్నది

బంధాలతోనే జీవించే సమాజంలో నవ జీవన విజ్ఞానం పలుకుతున్నది
సంబంధాలతో కొనసాగే ప్రపంచంలో నవ విధాన తర్పణం వచ్చేస్తున్నది  || ఏనాటిదో || 

21, జులై 2016, గురువారం

అమ్మ అనే భావన మేధస్సులో జీవిస్తున్నది

అమ్మ అనే భావన మేధస్సులో జీవిస్తున్నది
తల్లీ అనే వేదన హృదయంలో నివశిస్తున్నది  || అమ్మ అనే ||

జన్మించగా శ్వాసలో తొలి భావన అమ్మే అని
జీవించగా జీవంలో తొలి స్పర్శ తల్లియే అని

అమ్మతో జన్మించడం మధురమైన విశ్వ భావన
తల్లితో ఎదగడం మనోహరమైన దివ్య స్పందన

అమ్మతో జీవించడంలో కరుణామయ తన్మయం
అమ్మతో కొనసాగడంలో దయామయ తరుణత్వం  || అమ్మ అనే ||

అమ్మ అనే పిలుపుతో తన హృదయంలో మరో జీవం ఉదయిస్తుంది
అమ్మ అనే పలుకుతో తన మనస్సులో మరో శ్వాసయే ఎదుగుతుంది

అమ్మకు మనమే మరో ప్రాణమై మన సుఖ సంతోషాలనే కోరుకుంటుంది
అమ్మకు మనమే మరో జీవమై మన విజ్ఞాన అనుభవాలనే పంచుకుంటుంది

అమ్మతో మొదలైన జీవితం మరలా మరో జన్మ మరో అమ్మతోనే జననం
అమ్మతో సాగే జీవనం ఎప్పటికి మరవలేని గొప్ప జ్ఞాపకాల భావన వచనం  || అమ్మ అనే || 

20, జులై 2016, బుధవారం

అమ్మా అని పిలిచే పలుకులలోనే ఒక తియ్యని రాగం

అమ్మా అని పిలిచే పలుకులలోనే ఒక తియ్యని రాగం
తల్లీ అని పలికే మాటల పదాలలోనే ఒక తేనీయ స్వరం  || అమ్మా ||

అమ్మా అని పిలిచినా హృదయములో ఒక జీవన నాదం
అమ్మా అని పలికినా మనస్సులో ఒక మమకారపు గీతం

అమ్మగా లాలించే అలనాటి పాటలలో ఒక కమ్మని సంగీతం
అమ్మగా నడిపించే ఆనాటి నడకలలో ఒక నూతన కుసుమం  || అమ్మా ||

అమ్మగా ఎదిగినా అమ్మమ్మగా చూసే ప్రేమలో అనురాగం
అమ్మగా ఒదిగినా అమ్మమ్మతో కలిసే తీరులో అనుబంధం

అమ్మవై అమృతాన్ని పంచే అలనాటి జ్ఞాపకం తెలియని దైవం
అమ్మవై విజ్ఞానాన్ని పంచే ఆనాటి విద్యా గీతమే వేదాంత సత్యం  || అమ్మా ||  

12, జులై 2016, మంగళవారం

అమ్మా అనే పిలుపులో కమ్మని రాగమే తేనీయం

అమ్మా అనే పిలుపులో కమ్మని రాగమే తేనీయం
అమ్మా అనే తొలి పలుకులో మధురమే సుగంధం  || అమ్మా ||

నీ భావనతోనే నేను ఉదయించాను ఓ రూప వర్ణమై
నీ ఆలోచనతోనే నేను ఎదిగాను ఓ ఆకార స్వర జీవమై

నీవు పలికే పిలుపులలో నాలో కలిగేను ఓ ఉత్తేజం
నీవు తెలిపే పలుకులలో నాలో తెలిసేను ఓ కర్తవ్యం  || అమ్మా ||

నీ మాటల తరంగాలు నన్ను పిలిచేను వేణు గానంలా
నీ బాటల మార్గాలే నన్ను నడిపించేను ఓ బాటసారిలా

నీవే నా ఆశయమై నీ కోసమే నేను జీవిస్తున్నా ఆయుస్సునై
నీవే నా జీవన జీవమై నీ కోసమే నేను ఉదయిస్తా మరో జన్మనై  || అమ్మా ||