2, సెప్టెంబర్ 2026, బుధవారం

ఆదాయాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా శ్రమను ఎక్కువగా పెంచుతున్నారా

ఆదాయాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా శ్రమను ఎక్కువగా పెంచుతున్నారా 
ఖర్చు పెరిగితే శ్రమ పెరుగుతుంది శ్రమ పెరిగితే సామర్థ్యం ఆరోగ్యం తగ్గుతుంది 

సంపాదనను ఎంతగా ఖర్చు చేసినను అంతకన్నా ఎక్కువగా పొదుపు చేసుకోవాలి 
శ్రమను ఎంతగా పెంచుకున్నను సామర్థ్యాన్ని అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యం చేసుకోవాలి 

శ్రమను పెంచుకుంటూ పోతే ఏ క్షణమైనా అనారోగ్యం కలుగుతుంది 
ఖర్చును పెంచుకుంటూ పోతే ఏ క్షణమైనా అవసరం తీరకుండాపోతుంది 

శ్రమించుట వలన కార్య ఫలితం లేకుంటే జీవితమే ప్రయోజనం లేకుండా పోతుంది 
ఖర్చుల వలన కార్య ఫలితం లేకుంటే జీవనమే ఉపయోగం లేకుండా పోతుంది 

కార్య ఫలితం లేని శ్రమ కాలక్షేపమై సాగిపోతుంది జీవితం వ్యర్థం అవుతుంది 
కార్య ఫలితం లేని ఖర్చు కాలక్షేపమై సాగిపోతుంది జీవనం వృధా అవుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి