అహం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అహం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2016, గురువారం

నీవు నేను ఒకటే అన్న భావన లేదా ... (ప్రభూ)

నీవు నేను ఒకటే అన్న భావన లేదా ...  (ప్రభూ)
నేను నీవు ఒకటే అన్న ఆలోచన లేదా ... (గురూ)
నీవే నేను అన్న అర్థమైనను లేదా ... (దేవా)         || నీవు నేను ||

నేను అన్న అహం ఆనాటి పగటికే చెందునని
నేను అన్న ఇహం ఈనాటి రోజులకే చేరునని              
ఇహ పర లోక భావ తత్వాలు పరంపరలలోనే సాగునని తెలిసేనా

నీవే నేను అన్న అర్థ భావ తత్వాలు ఏ విజ్ఞాన గ్రంథంలో లిఖించబడలేదా
నేనే నీవు అన్న ఆత్మ పరమార్ధ తత్వములు ఏ మహాత్మునిచే తెలుపబడలేదా || నీవు నేను ||

ఏ భావ తత్వాలు ఎప్పుడు ఎవరికి కలుగునని తెలిసేనా
ఏ జీవ తత్వములు ఎప్పుడు ఎవరికి తోచేనని తెలిసేనా
ఏ విశ్వ తత్వాలు ఎప్పుడు ఎవరికి చేరునని తెలిసేనా

ఏనాటి అర్థాల భావ తత్వములో పర బ్రంహ జ్ఞానముచే తెలుపబడునా
ఏనాటి అర్థాల స్వభావాలోచనలో పర విష్ణు విజ్ఞానముచే తెలియబడునా
ఒకటే అర్థమైన పరమార్థం ఒకటేనని ఒకరిగా ఒకరికే నేడు తెలియునా     || నీవు నేను ||

2, జూన్ 2016, గురువారం

మాట మాట పలకరింపులో భావాన్ని మరవద్దు

మాట మాట పలకరింపులో భావాన్ని మరవద్దు
భావాలతో సాగే చర్చలలో హద్దులు మీరవద్దు   || మాట మాట ||

మాటలలో మంచి లేకపోతేనే వాదనలో ఆవేదన కలిగేను
సంభాషణలో అర్థం లేకపోతేనే ఆవేదన అనర్థమై సాగేను

మనం ఎదిగిన జ్ఞానముతోనే సంభాషణ విధానము సాగిపోయేను
సంభాషణలో విజ్ఞానము లేకపోతేనే వేదన వాదనలే ఆవేదనయ్యేను

అర్థాన్ని గ్రహించి పరమార్థాన్ని మెప్పించి మాటలలో అనుకువ ఉండాలి  
అహం లేని మన ఎదుగుదలతోనే ఒదిగిపోయే లక్షణంతో మాటలు సాగాలి  || మాట మాట ||

ఎంతటి మాటల చర్చలు జరిగినా సమాధానాలను ప్రశాంతంగా తెలుపుకోవాలి
ఎలాంటి పదాల వాదన సాగినా మన మాటలలో గౌరవ పదభూషణం ఉండాలి

ఎంత నేర్చినా అనుభవం మన జీవన తీరులోనే వస్తూ సాగుతుంది
ప్రయత్నం చేస్తేనే మాటల పదాల ఉచ్చరణ గొప్పగా ఉంటుంది

పదాలు పలకరింపులకే గాని వాదనలకు కాదని విజ్ఞానం తెలుపుతుంది
సమస్యలే వాదనలై మనం కలుగజేసుకునే ఆవేదనలను హెచ్చుగా సూచిస్తుంది || మాట మాట ||