అస్తమించేలోగ అనంతమైన విశ్వ విజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలవా గ్రహించగలవా
జన్మించుటలో ఉదయించుటలో ఏమున్నది మరణించుటలో ఏమున్నది అస్తమించుటలో ఏమున్నది
జీవించుటలోనే ఎన్నో విధానములు విజ్ఞానములు వివిధ కార్యములు కాల జ్ఞానములు కార్య జ్ఞానములు భావ స్వభావ తత్వములు కార్యాలోచనలులు కార్యాచరణములు కార్యప్రణాళికలు ఇలా ఎన్నో తెలుసుకుంటూ నేర్చుకుంటూ పరిశోధనలతో శ్రమించుటచే వివిధ సమయాలలో వివిధ రకాలుగా వివిధ పరిణామాలతో సాగుతున్నాయి
మన ముందు ఉన్నది కనిపిస్తున్నది ఎలా ప్రారంభమై ఉద్భవిస్తూ అవతరించి కాల సమయంతో ఎలా మారిపోతున్నది
ఆరోగ్యం ఉన్నది అనారోగ్యం ఉన్నది శ్రమించడం ఉన్నది ప్రశాంతత ఉన్నది లాభం ఉన్నది నష్టం ఉన్నది
ఎన్నో తెలుసుకుంటూ శ్రమతో సాగిపోతున్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఓ క్షణ సమయాన ఆగిపోతున్నాము
జీవన విధానమే జీవితమైతే విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోలేవు తెలుసుకొనుటకు సమయాన్ని చేసుకోలేవు
మేధస్సును విశ్వంతో లయం చేసుకుంటూ మేధా శక్తిని అనుభవాలతో ప్రకృతితో ఏకీభవిస్తూ శ్వాసతో గమనిస్తూ ధ్యాసతో అవగాహన చేస్తూ పరిశోధనచే గ్రహించడమే విశ్వ విజ్ఞాన ఏకాంత దైవ సామూహిక ద్వార మార్గ ప్రవేశము
విశ్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకొనుటకు జీవిత కాలం ఎలా సహకరిస్తుంది మేధస్సు ఎలా సమస్తాన్ని గ్రహిస్తుంది
మేధస్సును కార్య దృష్టితో విశ్వ దృష్టితో సాగిస్తూ అనుభవాలను లిఖించడంలో మరో ఏకాగ్రత మొదలై ప్రకృతితో లీనమై అనంతమైన జ్ఞానాన్ని గ్రహిస్తూ తెలుసుకుంటూ సాగిపోగలవు జీవితాన్ని మరో విధంగా పరిశోధించగలవు
ఆలోచించే విధానంతోనే విశ్వ విజ్ఞానాన్ని పరిశుద్ధంగా గ్రహిస్తూ తెలుసుసుకునే ప్రభావం మేధస్సులో కలుగుతుంది
విశ్వ విజ్ఞానాన్ని తెలిసిన వారు సంభాషించే వారు అరుదుగా ఉన్నారు స్పష్ఠంగా తెలిసినవారు పరిపూర్ణంగా ప్రబోధించేవారు అరుదుగానైనా కనిపించలేకున్నారు అన్వేషణచే పరిశోధనచే ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి
నీలోనే శ్వాస ధ్యాస ధ్యాన జ్ఞాన ప్రయాస గమన సూక్ష్మ గ్రహీత విచక్షణ పరిశోధన పరిశుద్ధంగా ప్రశాంతంగా ఉంటే పరిపూర్ణమైన విశ్వ విజ్ఞానం శూన్యం నుండి బ్రంహాండం దాకా మర్మాంతరాత్మమై మేధస్సులో మొదలవుతుంది
మేధస్సులో మర్మాంతరాత్మ పరిశోధనచే ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞాన మనో నిగ్రహ ఇంద్రియ విచక్షణాలచే విశ్వ విజ్ఞానం శ్వాస ధ్యాసతో దేహంలో చేరిపోతుంది
దేహం బ్రంహాండమై మేధస్సు విశ్వ విజ్ఞానమై శ్వాస పంచభూతమై శరీరం సమస్తమై రూపం అఖిలమైపోతుంది
స్త్రీలో మర్మాంతరాత్మ జీవ సృష్టి విధానం స్వయంగా పర ధ్యాస పర శ్వాసతో కార్యక్రియ (జీవక్రియ) క్రమంగా జరుగుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి