13, నవంబర్ 2013, బుధవారం

విశ్వాన్ని మరిచావా విశ్వ భావాన్ని తలిచావా

విశ్వాన్ని మరిచావా విశ్వ భావాన్ని తలిచావా విశ్వ రూపాన్ని తిలకించావా
విశ్వం ఎంతటిదో మానవుని మహా మేధస్సుతో ఏనాడైనా అంచన వేశావా
విశ్వాన్ని తిలకించు మేధస్సునే మెప్పించు ఆత్మనే అంతరాత్మతో ఎకీభవించూ
విశ్వమున ప్రతి క్షణం అనుభూత తత్వపు అనుభవాలు ఎన్నో నీవే లెక్కించూ

29, అక్టోబర్ 2013, మంగళవారం

ఒకరు మనకు తెలుసు అంటే

ఒకరు మనకు తెలుసు అంటే -
వారి గురుంచి కాస్త మనకు తెలిసి ఉంటుంది
లేదా తెలుసుకోవాలని అనిపిస్తుంది
తెలిసి ఉంటే అనుభవం - తెలుసుకోవాలని ఉంటే విజ్ఞానం
తెలిసినది ఉపయోగపడుతుంది తెలియనిది అవసరమవుతుంది
ఎంత తెలిసినా తెలుసుకోవాలని సాగి పోతుండడమే జీవితం

12, సెప్టెంబర్ 2013, గురువారం

మనస్సు మేధస్సుకు ఏం తెలుపుతుందోగాని

మనస్సు మేధస్సుకు ఏం తెలుపుతుందోగాని ఆలోచిస్తేగాని తెలియదు
ఆలోచనతో తెలిసిన దానిని మళ్లి ఏం చేయాలో ఆలోచింప చేస్తుంది
ఆలోచనలతో తెలిశాక అర్థమైతే ఒక కోరికగా లేదా ఆశగా తోస్తుంది
తోచిన దానిని తీర్చుకోవడాని మార్గాన్ని ఆలోచిస్తూ సాగిపోతుంటాము
కొన్ని తీరగలవు మరికొన్ని తీరకుండా మిగిలి పోతుంటాయి
తీరనివాటి కోసం ఆలోచిస్తూ ఎంతో సమయం వృధా చేస్తుంటాము

1, ఆగస్టు 2013, గురువారం

భవిష్య ఆలోచన లేని కార్యాన్ని

భవిష్య ఆలోచన లేని కార్యాన్ని కొనసాగించుటలో సమస్య కలుగుతున్నది
కార్యం ముగిసిన తర్వాత సమస్యతో భవిష్య కార్య ఆలోచన తెలుస్తున్నది
కొత్త పాత కార్యాలను వివిధ రకాలుగా కొనసాగించుటలో సమస్యలొస్తుంటాయి
సమస్యలతో సతమతమవుతూనే ఎన్నో కార్యాలు సాగిపోతుంటాయి
సమస్యలతో కొత్త విజ్ఞానాన్ని భవిష్య ప్రజ్ఞానాన్ని అధిగమిస్తూ సాగిపోవాలి

30, జులై 2013, మంగళవారం

విశ్వాన్ని మార్చే శక్తి నాలోనే ఉందని

విశ్వాన్ని మార్చే శక్తి నాలోనే ఉందని మీకు ఎలా తెలుపను
విశ్వ కార్యాలను నడిపించే విధానాలు నాలోనే ఉన్నాయి
రేపటి భవిష్య రీతి నిర్మాణ జీవన ప్రణాళికలు నాతోనే ఉన్నాయి
భవిష్య జీవితం స్వర్గంలా ఉండాలంటే నన్నే కలవాలి
సాధ్యం కాదని అనుకుంటే అజ్ఞాన భవిష్యత్తే సాగుతుంది
ఎన్ని కోట్ల యుగాలు గడిచినా సమాజం అపరిశుభ్రతయే
నాలో ఉన్న విధానం మలినం లేని సమాజ సిద్ధాంతమే
మలినంలేని భవిష్య నిర్మాణం లేకపోతే జీవించడం అనవసరమే
మానవ మేధస్సులో కూడా మలినం ఉంటే ఆలోచన అజ్ఞానమే
మానవ జీవికే భవిష్య విజ్ఞాన ఆలోచన లేకపోతే ఏ జీవికి కలుగును
For reference/Model : Visit Infosys Campus, Mysore - INDIA

23, జులై 2013, మంగళవారం

మరవలేని జీవితాన్ని గమనిస్తూ

మరవలేని జీవితాన్ని గమనిస్తూ మరణిస్తున్నా
మరణించినా నా జీవితాన్ని కొనసాగిస్తున్నా
జీవిస్తూనే నా జీవితం ముగిసిపోతున్నా
మరణిస్తూ నా జీవితాన్ని గమనిస్తున్నా

నేను గమనించే జీవితం విశ్వంతో సాగిపోతూనే ఉంటుంది
నేను మరణించే జీవితం గమనంతో కొనసాగుతూనే ఉంటుంది
జీవించే దేహానికి మరణం ఉందేమోగాని గమనించే నా మేధస్సుకు మరణం లేదు
శరీర కార్యాలు ఆగిపోతున్నా మేధస్సులోని విజ్ఞాన గమనాలు కొనసాగుతూనే

16, జులై 2013, మంగళవారం

మరణిస్తున్నానని తెలిసినా జీవిస్తున్నాను

మరణిస్తున్నానని తెలిసినా జీవిస్తున్నాను ఎందుకో
ఎప్పుడు మరణిస్తానో తెలియనందుకే జీవిస్తున్నానేమో
మరణం ఉన్నా ఎందరో జీవిస్తున్నాము ఎందుకో
ఎందరో జన్మిస్తున్నామని మరణం మనకు ఉందేమో

19, జనవరి 2013, శనివారం

ఈ జీవితాన్ని ఎప్పటికీ మరవలేను

ఈ జీవితాన్ని ఎప్పటికీ మరవలేను
మనస్సును ఏ నాటికి ఓర్చుకోలేను
మేధస్సును ఇక నేను మెప్పించలేను
విశ్వాన్ని ఎందుకో నే విడిచిపోలేను